Health Benefits : నేరేడు పండ్లు ఎక్కువ‌గా తింటున్నారా…అయితే ఈ 4 స‌మ‌స్య‌ల‌కు వెల్ క‌మ్ చెప్పిన‌ట్లే.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Benefits : నేరేడు పండ్లు ఎక్కువ‌గా తింటున్నారా…అయితే ఈ 4 స‌మ‌స్య‌ల‌కు వెల్ క‌మ్ చెప్పిన‌ట్లే..

Health Benefits : నేరేడు పండ్లు ఎక్కువ‌గా ఎండాకాలం ముగుస్తున్న స‌మ‌యంలో బాగా దొరుకుతాయి. గ్రామాల‌లో ఎక్కువ‌గా ఈ నేరేడు చెట్లు క‌నిపిపిస్తాయి. ఇవి చూడ‌డానికి న‌ల్ల‌గా క‌నిపిస్తాయి. కాని రుచి ఎంతో బాగుంటుంది. ఇవి వేస‌వికాలం లోనే ఎక్కువగా పండుతాయి. త‌రువాత సీజ‌న్ లో దొర‌క‌వు. క‌నుక ఈ సీజ‌న్ లోనే వీటిని తినాలి. నేరేడు పండ్ల‌ను ఇండియ‌న్ బ్లాక బెర్రీ లేదా జామున్ అంటారు. అంతేకాకుండా, ఈ పండ్ల‌ను జావా ప్ల‌మ్ అని కూడా […]

 Authored By anusha | The Telugu News | Updated on :26 June 2022,4:00 pm

Health Benefits : నేరేడు పండ్లు ఎక్కువ‌గా ఎండాకాలం ముగుస్తున్న స‌మ‌యంలో బాగా దొరుకుతాయి. గ్రామాల‌లో ఎక్కువ‌గా ఈ నేరేడు చెట్లు క‌నిపిపిస్తాయి. ఇవి చూడ‌డానికి న‌ల్ల‌గా క‌నిపిస్తాయి. కాని రుచి ఎంతో బాగుంటుంది. ఇవి వేస‌వికాలం లోనే ఎక్కువగా పండుతాయి. త‌రువాత సీజ‌న్ లో దొర‌క‌వు. క‌నుక ఈ సీజ‌న్ లోనే వీటిని తినాలి. నేరేడు పండ్ల‌ను ఇండియ‌న్ బ్లాక బెర్రీ లేదా జామున్ అంటారు. అంతేకాకుండా, ఈ పండ్ల‌ను జావా ప్ల‌మ్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు మార్కెట్లో ఈ కాలం బాగా కొనుగోలు అవుతాయి. నేరేడు పండ్ల‌లో ఆయుర్వేదానికి చెందిన ఔష‌ధ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి మ‌న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వివిధ ర‌కాల రోగాల బారిన ప‌డ‌కుండా కాపాడుతాయి. అందుకే వీటి రేటు ఎక్కువ‌గా ఉన్న ఆరోగ్య‌ప‌రంగా చాలా ఉప‌యోగాలు ఉన్నాయ‌ని త‌ప్ప‌కుండా కొనుగోలు చేస్తారు. ఆయుర్వేద శాస్త్ర ప్ర‌కారం, నేరేడు పండ్ల వ‌ల‌న మ‌న ఆరోగ్యానికి చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.ఈ పండ్ల‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా దొరుకుతుంది.

నేరేడు పండ్ల‌ను తిన‌డం వ‌ల‌న మ‌న‌ శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే ర‌క్తంలోని చ‌క్కెర‌ను పెర‌గ‌కుండా, తగ్గ‌కుండా నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. నేరేడు పండ్లు మాత్ర‌మే కాదు, వాటి ఆకులు కూడా చాలా ఉప‌యోగ‌క‌ర‌మైన‌వి. వీటి ఆకులు వివిధ ర‌కాల రోగాల‌ను మ‌న‌కు రాకుండా చేస్తాయి. అయితే ఈ నేరేడు పండ్ల‌తో కొద్దిగా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే నేరేడు పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంత‌ మేలు చేస్తాయో, అంత కీడును కూడా చేస్తాయి. అయితే వీటిని ఎక్కువ‌గా తింటే ముఖ్యంగా ఈ నాలుగు స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తాయంట‌. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… మొద‌టిగా ఈ నేరేడు పండ్ల‌ను రుచిగా బాగున్నాయి క‌దా అని ఎక్కువ‌గా తింటే మ‌న చ‌ర్మానికి సంబంధించిన అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. నేరేడు పండ్ల వ‌ల‌న ముఖంపై మ‌చ్చ‌లు, మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే జుట్టు కూడా ఎక్కువ‌గా రాలిపోయో ప్ర‌మాదం ఉంది.

Health Benefits of blueberry uses dont eat much these causes 4 health problems

Health Benefits of blueberry uses dont eat much these causes 4 health problems

అందుకే నేరేడు పండ్ల‌ను ఎక్కువ‌గా తిన‌క‌పోవ‌డం చాలా మంచిది. రెండ‌వ‌ది కొంత‌మందికి నేరేడు పండ్లు ప‌డ‌వు. వాటి వాస‌న‌ను చూస్తేనే వికార‌వ‌గా ఫీల‌వుతారు. అలాంట‌ప్పుడు ఈ పండ్ల‌ను తిన‌కుండా ఉండ‌డ‌మే మంచిది. ఎవ‌రైన బ‌ల‌వంతంగా తినిపిస్తే త‌రువాత వాంతులు చేసుకునే అవ‌కాశం ఉంది. క‌నుక నేరేడు పండ్ల‌ను తిన‌కుండా ఉండ‌డ‌మే ఆరోగ్యానికి మంచిది. హైబీపి ఉన్న‌వారు నేరేడు పండ్ల‌ను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కాని వీటిని అధికంగా తిన్నారంటే మ‌రొక స‌మ‌స్య‌ను తెచ్చుకున్న‌ట్లే. ఎందుకంటే నేరేడు పండ్ల‌ను ఎక్కువ‌గా తింటే లోబీపి స‌మ‌స్య వ‌స్తుంది. అంటే బీపి ఉండాల్సిన దాని కంటే త‌క్కువ‌గా ప‌డిపోతుంది. క‌నుక నేరేడు పండ్ల‌ను మ‌రి ఎక్కువ‌గా కాకుండా, మ‌రి త‌క్కువ‌గా కాకుండా తినాలి. స‌రిపోను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక నాలుగ‌వ‌ది కోంద‌రికి మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య ఉంటుంది. అలాంటి వారు నేరేడు పండ్ల‌ను ఎక్కువ‌గా తిన‌కూడ‌దు. ఎక్కువ‌గా తింటే ఆ స‌మ‌స్య ఇంకా ఎక్కువ‌గా బాధిస్తుంది.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది