Curry leaves should be taken on an empty stomach
Health Benefits : కరివేపాకులో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. భారతీయులు ఎక్కువగా వంటకాల్లో కరివేపాకు ఆకులను వాడుతుంటారు. ఇవి రుచితో పాటు సువాసనను వెదజల్లుతాయి. చాలా మంది వీటని రుచి కోసం మాత్రమే వాడుతుంటారని అనుకుంటారు. కానీ కరివేపాకు ఆకలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. గ్రామాల్లో ఈ చెట్లు దాదాపు ప్రతి ఇంటి ఆవరణలో కనిపిస్తుంటుంది. ప్రతి వంటకంలో కరివేపాకులు వాడినప్పటికీ చాలా మంది తినకుండా పడేస్తుంటారు. అలా చేయకుండా కరివేపాకు ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం… కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
అలాగే విటమిన్ సీ, ఏ, బీ, ఈలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవానాయిడ్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. కరివేపాకు జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి ఆకలిని పెంచుతుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దీంతో గుండెకు మేలు జరుగుతుంది. అంతే కాకుండా మలబద్దకాన్ని నివారిస్తుంది. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత వంటి సమస్యలను కరివేపాకు కంట్రోల్ చేస్తుంది. అలాగే కరివేపాకులను రెగ్యూలర్ ఆ తీసుకుంటే క్యాన్సర్ దరి చేరకుండా చేయవచ్చు. అలాగే ప్రతిరోజూ ఉదయం మూడు లేదా నాలుగు కరివేపాకు ఆకులను నమిలి తింటే చాలా రకాల వ్యాధులను రాకుండా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Health Benefits of Curry tree
రేచీకటి, కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు కరివేపాకు ఆకులను తింటే చక్కటి ఉపషమనం లభిస్తుంది. అలాగే షుగర్ స్థాయిలను తగ్గించే హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉండటంతో బయాబెటీస్ రోగులకు అద్బత ఔషదంగా పనిచేస్తుంది.కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీంతో అనేక రకాల ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. అలాగే కరివేపాకులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు. అందుకే రెగ్యూలర్ గా ఆహారంలో భాగం చేసుకోండి.
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
Guvvala Balaraju : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
This website uses cookies.