Health Benefits : క‌రివేపాకుతో ఇన్ని ప్ర‌యోజ‌నాలా.. తెలిస్తే అస్స‌లు వ‌ద‌ల‌రు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : క‌రివేపాకుతో ఇన్ని ప్ర‌యోజ‌నాలా.. తెలిస్తే అస్స‌లు వ‌ద‌ల‌రు

 Authored By mallesh | The Telugu News | Updated on :27 May 2022,11:00 am

Health Benefits : క‌రివేపాకులో అదిరిపోయే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. భార‌తీయులు ఎక్కువ‌గా వంట‌కాల్లో క‌రివేపాకు ఆకుల‌ను వాడుతుంటారు. ఇవి రుచితో పాటు సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతాయి. చాలా మంది వీట‌ని రుచి కోసం మాత్ర‌మే వాడుతుంటార‌ని అనుకుంటారు. కానీ క‌రివేపాకు ఆక‌లు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. గ్రామాల్లో ఈ చెట్లు దాదాపు ప్ర‌తి ఇంటి ఆవ‌ర‌ణ‌లో క‌నిపిస్తుంటుంది. ప్ర‌తి వంట‌కంలో క‌రివేపాకులు వాడిన‌ప్ప‌టికీ చాలా మంది తిన‌కుండా ప‌డేస్తుంటారు. అలా చేయ‌కుండా క‌రివేపాకు ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం… క‌రివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

అలాగే విటమిన్ సీ, ఏ, బీ, ఈలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు, ఫ్లేవానాయిడ్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. కరివేపాకు జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌రిచి ఆకలిని పెంచుతుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దీంతో గుండెకు మేలు జరుగుతుంది. అంతే కాకుండా మలబద్దకాన్ని నివారిస్తుంది. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత వంటి సమస్యలను కరివేపాకు కంట్రోల్ చేస్తుంది. అలాగే క‌రివేపాకుల‌ను రెగ్యూల‌ర్ ఆ తీసుకుంటే క్యాన్స‌ర్ ద‌రి చేర‌కుండా చేయ‌వ‌చ్చు. అలాగే ప్రతిరోజూ ఉదయం మూడు లేదా నాలుగు క‌రివేపాకు ఆకులను నమిలి తింటే చాలా ర‌కాల వ్యాధుల‌ను రాకుండా చేయ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Health Benefits of Curry tree

Health Benefits of Curry tree

రేచీక‌టి, కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు క‌రివేపాకు ఆకుల‌ను తింటే చ‌క్క‌టి ఉప‌ష‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే షుగ‌ర్ స్థాయిలను త‌గ్గించే హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉండ‌టంతో బ‌యాబెటీస్ రోగుల‌కు అద్బ‌త ఔష‌దంగా ప‌నిచేస్తుంది.కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. దీంతో అనేక రకాల ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్ట‌వ‌చ్చు. అలాగే కరివేపాకులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గి బ‌రువు త‌గ్గుతారు. అందుకే రెగ్యూల‌ర్ గా ఆహారంలో భాగం చేసుకోండి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది