Home » Exclusive » Health Benefits Of Drink Milk Mixed With Honey
Exclusive

Health Benefits : లక్షలు ఖర్చుపెట్టిన నిద్ర రావడం లేదా.? అయితే ఈసారి ఇది తీసుకోండి… గాఢంగా నిద్రపోతారు..

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 11, 2022, 5:00 pm
Advertisement

Health Benefits : ఇప్పుడు మనం జీవిస్తున్న జీవన శైలిలో చాలామందికి నిద్రలేని సమస్యతో బాధపడుతున్నారు. వయసు తరహా లేకుండా ఈ సమస్యతో అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. దీనికోసం ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఎన్ని లక్షలు ఖర్చు చేసిన ఈ సమస్య నుంచి ఉపశమనం కలగట్లేదు. పాతకాలంనాటి రోజులలో రోజంతా కష్టపడి రాత్రి సమయం కి కడుపునిండా భోజనం చేసి పడుకునేవారు.. ఆ విధంగా పడుకోగానే గాఢమైన నిద్ర పట్టేదట. అయితే ఇప్పుడు శరీరానికి ఎక్కువ కష్టం కలగకపోవడం వలన ఈ సమస్య రోజురోజుకి అధికమవుతుంది. నైట్ అంతా సరియైన నిద్రపోకపోవడం వలన ఆ రోజంతా ఏ పని చేసుకోవడానికి శరీరం అనుకూలించదు.

Advertisement

ఇక ఏ పని మీద ధ్యాస పెట్టలేము ఏదో టెన్షన్ ,ఆందోళన ఎలా పెరిగిపోతూ ఉంటాయి. రోజుకు ఎనిమిది గంటల నిద్ర మనిషికి చాలా ముఖ్యం. శరీరానికి రెస్ట్ అనేది లేకపోవడం వలన హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ మైగ్రేన్ లాంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఈ ఇబ్బందులను పోగొట్టుకుని సుఖమైన నిద్ర కోసం హాస్పిటల్ కు పదేపదే వెళ్లి లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని లక్షలు ఖర్చు చేసిన ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు. అయితే అటువంటి సమస్యలు ఉన్నవారు ఈ టిప్ ని పాటించినట్లయితే చిన్నపిల్లల్లాగా నిద్రపోతారు. దీనికోసం మొదటిగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు పాలు పోసి దానిని స్టవ్ మీద పెట్టి మరగించుకోవాలి.

Health Benefits of Drink milk mixed with honey

Advertisement

ఆ తర్వాత గ్లాసులు ఆ పాలను పోసుకొని దాన్లో ఒక చెంచా తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా నిత్యము నైట్ భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఈ పాలను తీసుకోవాలి. పడుకోవడానికి అర్థగంట ముందు ఈ పాలని త్రాగాలి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఇలా పాలు తీసుకున్న పది నిమిషాల లోపే డీప్ నిద్రలోకి వెళ్తారు. ఎన్ని హాస్పిటల్లో తిరిగి ఎన్నో లక్షలు ఖర్చుపెట్టిన ఉపయోగం లేదు అనుకున్న వాళ్లు.. ఈ చిట్కాను ఒక్కసారి ట్రై చేసి చూడండి మంచి ఉపశమనం కలుగుతుంది. పాలు తేనె కలిపి త్రాగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు ఈ పాలని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు త్రాగవచ్చు…

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి