Barley Water : బార్లీ నీటి గురించి మీకు తెలుసా..? సర్వరోగ నివారిణి.. ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో....!
Barley water : వేసవికాలం అనగానే గుర్తు వచ్చేది వివిధ రకాల పానీయాలు, నీరు , కూల్ డ్రింక్స్ వంటివి. వేసవికాలంలో శరీరం ఎప్పుడు హైడ్రేట్ గా ఉండడం అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు వేసవిలో వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే కూల్ డ్రింకులకు బదులుగా బార్లీ నీటిని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బార్లీ నీరు శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఈ బార్లీ నీళ్లలో పోషక గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అందుకే నిపుణులు ఈ బార్లీ నీటిని ప్రతిరోజు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిని ప్రతిరోజు తీసుకోలేకపోయినా కనీసం వారానికి 3 లేదా 4 రోజులు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు.మరి ఇన్ని పోషక గుణాలు కలిగి ఉన్న ఈ బార్లీ నీరు గురించి మీకు తెలుసా…?ఇప్పుడు తెలుసుకుందాం పదండి…
శరీరానికి పోషకాలను అందించే పానీయాలలో బార్లీ నీరు కూడా ఒకటి. ఇక ఈ బార్లీ నీటిని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపున తీసుకోవడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. బార్లీ నీరు పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తగ్గించడానికి చక్కటి పరిష్కారం.దీని ద్వారా రక్తంలో ఉన్న కొవ్వు పదార్థాలు వేగంగా కరిగిపోవడం జరుగుతుంది. అలాగే బార్లీ నీటిలో బీటా మరియు బ్లూ కం అనే కరిగే ఫైబర్ ఉండడం వలన ఇది మన శరీర బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు ఈ బార్లీ నీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా బార్లీ నీరు ఎముకల్లో ఉండే యూరిక్ యాసిడ్ స్పటికాలను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. వాటితో పాటుగా కీళ్ల నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులను కూడా ఇది తగ్గించడం జరుగుతుంది. జీర్ణ క్రియ కు ఫైబర్ కు ఉపయోగపడే కొన్ని రకమైన పోషకాలు ఈ బార్లీ లో అధికంగా ఉన్నాయి. అయితే చాలామంది ఈ బార్లీ నీటిని కడుపు నొప్పి, వేడి అలసట వంటి సమస్యలకు ఇంటి నివారణగా ఉపయోగిస్తారు. బార్లీ నీరు మధుమేహ వ్యాధులకు మంచి ఆహారంగా మారుతుంది. ఎందుకంటే ఇందులో తక్కువగా ఉండే గ్లసమిక్ ఇండెక్స్ లక్షణాల కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
Barley Water : బార్లీ నీటి గురించి మీకు తెలుసా..? సర్వరోగ నివారిణి.. ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో….!
మరి ఇన్ని ప్రయోజనాలను కలిగి ఉన్న బార్లీ నీటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసా. అయితే ఇప్పుడు తెలుసుకుందాం. బార్లీ నీటిని తయారు చేసుకోవడానికి ముందుగా రెండు గ్లాసుల నీరు తీసుకుని దానిలో బార్లీ లేదా బార్లీ గింజల పొడిని వేసి మరిగించుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీనిని బాగా మరిగించిన తర్వాత ఈ నీటిని చల్లార్చి ఫిల్టర్ చెయ్యాలి. అనంతరం దీనిలో కొద్దిగా నిమ్మరసం తేనె లేదా యాలకుల పొడి కలిపి తాగాలి. ఈ విధంగా బార్లీ నీటిని ప్రతిరోజు తాగటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.