Mangoes : మామిడిపండు పండ్ల లోనే రారాజు. సీజనల్ ఫ్రూట్ గా పిలవబడే ఈ మామిడిపండును ఇష్టపడని వారు అంటూ ఎవ్వరు ఉండరు.మామిడిపండు తినే అనుభూతి వేసవికాలంలో మాత్రమే దొరుకుతుంది. వేసవికాలంలో మాత్రమే మామిడిపండు అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత అవి దొరకడం చాలా కష్టం. అయితే ఈ మామిడి పండ్లు చాలా రకాలుగా ఉంటాయి. అలాగే మామిడిపండ్లలో అనేక రకల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి. అయితే వేసవిలో ఎక్కువగా తినే ఈ మామిడి పండ్లను తినేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు లేదంటే అనారోగ్యం భారీన పడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే మామిడి పండ్లతో పాటు కొన్ని పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వాటి వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది. మరి మామిడితో కలిపి తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మామిడి పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగకూడదు. ఒకవేళ తాగినట్లయితే అజీర్తి ,ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మామిడి పండుతో కాకరకాయ తినడం మంచిది కాదు. ఒకవేళ మామిడికాయతో కాకరకాయ తిన్నట్లయితే దీనివల్ల విషతుల్యం అవుతుందని మరియు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.
మామిడికాయలతో పచ్చిమిరపకాయ తిన్నట్లయితే కడుపులో చికాకు కలుగుతుంది. దీనివల్ల విరోచనాలు అవుతాయి.
మామిడి పండ్లను రాత్రి భోజనంలో తీసుకున్నట్లయితే వెంటనే శీతల పానీయాలను తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే జీర్ణ క్రియ పై ప్రభావం పడుతుంది. దీంతో జలుబు వచ్చే ప్రమాదం ఉంటుంది.
స్పైసీ ఫుడ్.
చాలామంది మామిడి పండ్లను రాత్రి సమయంలో లేదా మధ్యాహ్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మామిడి పండ్లు తిన్న వెంటనే స్పైసీ ఫుడ్ ను తినకూడదు. దీనివల్ల ఆరోగ్యం పాడవుతుంది.
పెరుగు.
భోజన సమయంలో పెరుగులో మామిడిపండును కలిపి తీసుకోకూడదు. అలా తీసుకోవడం వలన కడుపులో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం వలన కడుపునొప్పి వస్తుంది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.