Apple peal : ఆపిల్ తొక్క పడేసి తింటున్నారా... అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోండి...!
Apple peal : ఆపిల్ పండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే డాక్టర్లు సైతం ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరమని చెబుతుంటారు. అయితే చాలామంది ఈ ఆపిల్ పండు ను తొక్క పడేస్తూ తింటూ ఉంటారు. కాని వైద్య నిపుణులు మాత్రం ఆపిల్ పండు తొక్కతోనే తినాలి అని చెబుతారు. ఎందుకంటే ఆపిల్ పండు తొక్కలో అనేక పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరిముఖ్యంగా చిన్నపిల్లలు ఆపిల్ తొక్క పడేసి తింటారు. ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పోగొట్టుకుంటున్నారని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆపిల్ తొక్కను తినకపోవడం వలన కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
యాపిల్ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడనికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేయడానికి కూడాఉపయోగపడుతుంది. అలాగే యాపిల్ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు కాలయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. యాపిల్ తొక్క లో ఉండే ఫైబర్ జీర్ణ క్రియ సవ్యంగా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఫైబర్ డయాబెటిక్ పేషంట్లకు మంచిది. యాపిల్ తొక్కలో ఉండే పాలీఫెనాల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను మరియు రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే గుండెలోని సిరలను మృదువుగా ఉంచుతుంది. దీనివలన సిరలలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. దీంతో గుండె జబ్బులకి దూరంగా ఉంటారు.
Apple peal : ఆపిల్ తొక్క పడేసి తింటున్నారా… అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోండి…!
ముఖ్యంగా ఆపిల్ పీల్స్ లో విటమిన్ సి, విటమిన్ కె ,విటమిన్ ఏ లు ఉన్నాయి. ఇందులో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే పోషకాలు ఉన్నాయి. యాపిల్ తొక్కలో ఫైబర్లు ఉండడం వలన ఎన్ని గంటలు అయిన ఇది కడుపుని నిండుగా ఉంచుతుంది. దీనివల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే బరువు తగ్గాలి అనుకునేవారు దీనిని తినవచ్చు. ఆపిల్ తొక్కలో చెడు కొలెస్ట్రాలను నియంత్రించగల పోషకాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడంతో ఊపిరితిత్తులను మరియు గుండెను అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. కాబట్టి ఆపిల్ తొక్క పడేస్తే అనేక పోషకాలను పడేసినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆపిల్ ను తొక్కతో తినడం ఆరోగ్యానికి ఎంతో మేలుని కలుగజేస్తుంది.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.