Categories: HealthNews

Glue Berry : ఈ పండ్లు వందల సమస్యలకు దివ్య ఔషధం…!

Glue Berry : మన చుట్టూ ఉన్నటువంటి పకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో వాటిని విరివిగా వాడుతున్నారు. పకృతి ఒడిలో పుట్టిన మరో ఔషధగని నక్కెర కాయల చెట్టు. ఈ చెట్టు చాలా చోట్ల రోడ్ల వెంట విరిగా కనిపిస్తుంది. చెట్టు నిండ పండ్లతో ఉండే ఈ చెట్టును పిచ్చి చెట్టు అనుకోని కొంతమంది అసలు పట్టించుకోరు. కానీ ఈ మొక్క ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఎంతో ఆశ్చర్యపోతారు. ఈ చెట్టు నుండి వచ్చే పండ్లు ఔషధ గుణాలకు ఎంతో ప్రసిద్ధి. ఈ పండుతో చేసిన ఊరగాయలు మరియు కూరలు అద్భుత రుచి కలిగి ఉంటాయి. ఈ నక్కెర పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది వీటిని విరిగా చెట్టు, బంక నక్కెర, బంక కాయలు, బంక కాయల చెట్టు ఇలా ఎన్నో రకాలుగా పిలుస్తూ ఉంటారు. విరిగి పండ్లలో ప్రోటీన్, క్రూడ్ ఫైబర్, కార్బోహైడ్రేట్, కొవ్వు,ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ మరియు కాల్షియం లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనితో పాటు యాంటీ ఇన్ ఫ్లమెంటరీ లక్షణాలు కూడా దీనిలో ఉన్నాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఈ బంక పండ్లను తినటం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఈ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. విరిగి కాయల చెట్టు మూడు నుండి నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ విరిగి చెట్టుకు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తూ ఉంటాయి. విరిగి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో అలాగే పండిన తర్వాత లేత ఎరుపు రంగులోకి వస్తాయి. వీటి కాయల లోపల కండ కలిగి సాగే గుణంతో తీపి పదార్థం అనేది ఉంటుంది. అందుకే దీనిని బంకకాయల చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ విరిగి కాయలను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని తినడం వలన డయాబెటిస్ అదుపులో వస్తుంది అని పరిశోధనలో కూడా తేలింది. ఈ పండ్లు తినటం వలన రక్తంలోని గ్లూకోస్ స్థాయి కూడా కంట్రోల్ లో ఉంటుంది. మలబద్ధకం, అజీర్తి,గ్యాస్ సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి అని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. వర్షాకాలంలో చర్మంపై కురుపులు రావడం సర్వసాధారణమైనది. ముఖ్యంగా పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ బంక చెట్టు ఆకులను మెత్తగా నూరుకొని చర్మంపై రాస్తే ఉపశమనం కలుగుతుంది. దురద,అలర్జీ సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ మొక్క సహాయం చేస్తుంది. దీనికోసం ఈ పండ్ల గింజలను మెత్తగా రుబ్బుకొని దురద ఉన్నచోట రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది..

Glue Berry : ఈ పండ్లు వందల సమస్యలకు దివ్య ఔషధం…!

గొంతు నొప్పి తగ్గించేందుకు కూడా ఈ చెట్టు బెరడు కషాయం పనిచేస్తుంది. దీనిలో బెరుడు, నీటిలో వేసి మరిగించి దానిని వడపోసి తాగాలి. రుచి కోసం నల్ల మిరియాలు,తేనెను కలుపుకోవచ్చు. ఇది మీ గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది. అంతేకాక ఈ చెట్టు బెరడు కషాయం మహిళలకు పీరియడ్స్ నొప్పి నుండి కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది. కొన్ని పదార్థాలు తిన్న తరువాత చాలా మందికి చిగుళ్ళు మరియు పంటి నొప్పి లాంటివి మొదలవుతాయి. ఇది మొత్తం నోటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినటం వలన నోటి పూత కూడా నయం అవుతుంది. నోటి ఆరోగ్యం కోసం నక్కెర చెట్టు బెరడు పొడిని తీసుకొని, రెండు కప్పుల నీటిలో కలిపి, మరిగించి,ఈ పానీయాన్ని తీసుకోవడం చాలా మంచిది. లేకుంటే ఈ కషాయంతో నోటిని పుక్కిలించిన కూడా ఫలితం అనేది దక్కుతుంది. దీంతో పంటి నొప్పి,అల్సర్లు,చిగుర్లు వాపులు అన్నీ కూడా వెంటనే నయం అవుతాయి. ఆర్థరైటిస్ తో బాధపడే వారు కూడా కీళ్ల నొప్పుల నుండి గ్లూబెర్రీ రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే ఉపశమనం లభిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం. ఈ గ్లూబేర్రి పండ్లు మరియు ఆకులు అనాల్జేసిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాక మీ వయసు కంటే ముందే మీ జుట్టు బూడిద రంగులోకి మారుతున్నట్లు ఉంటే బంక చెట్టు మీకు వంటింటి ఔషధంగా కూడా పనిచేస్తుంది. దీని పండ్లు నుండి తీసిన రసాన్ని జుట్టు మీద అప్లై చేయడం వలన నేరిసిన జుట్టు సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. మీరు ఈ పండు రసాన్ని నూనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ మిశ్రమం తలనొప్పి సమస్య నుండి కూడా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ పండ్లు అరగటానికి ఎక్కువ టైం పడుతుంది. కావున వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు…

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

7 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

8 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

10 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

11 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

12 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

13 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

14 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

14 hours ago