
Honey Black Pepper : చలికాలంలో వచ్చే వ్యాధుల నుండి ఉపశమనం పొందాలంటే... ఈ రెండిటిని కలిపి తీసుకోండి...??
Honey Black Pepper : శీతాకాలంలో ప్రతి ఒక్కరి వంట గదిలలో మసాలాల వాడకం అనేది బాగా పెరుగుతుంది. వీటిలో లవంగాలు మరియు యాలకులు, ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు ఇలా ఎన్నో రకాల మసాలా దినుసులు మన గృహ నివారణ చిట్కాలలో వాడతాము. అయితే ఈ నల్ల మిరియాలను తేనె లో కలిపి తీసుకుంటే, చలికాలంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఆయుర్వేదంలో నల్ల మిరియాలకు మరియు తేనెకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ తేనె లో మిరియాలను కలిపి తీసుకోవడం వలన ఎన్నో రకాల వ్యాధులు కూడా దూరం అవుతాయి అని అంటున్నారు. అలాగే జలుబు మరియు దగ్గు సేజనల్ గా వచ్చే వ్యాధులు కూడా దూరం అవుతాయి అని అంటున్నారు. అయితే ఈ రెండిటి ని కలిపి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Honey Black Pepper : చలికాలంలో వచ్చే వ్యాధుల నుండి ఉపశమనం పొందాలంటే… ఈ రెండిటిని కలిపి తీసుకోండి…??
నల్లమిరియాలు మరియు తేనె ఈ రెండు కూడా యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అయితే ఈ కాలంలో ఒకటి లేక రెండు మిరియాలను ఒక టీ స్పూన్ తేనె లో కలిపి తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే వీటిలో విటమిన్ కె మరియు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఎన్నో రకాల విటమిన్లు మరియు ఖనిజాలు అనేవి తేనెలో ఉంటాయి. అలాగే తేనె మరియు నల్ల మిరియాల లో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా ఉంటాయి. ఈ సీజన్ లో అధికంగా వచ్చే కీళ్ల నొప్పులు మరియు వాపు సమస్యలకు తేనే మరియు నల్లమిరియాలు అద్భుతంగా పని చేస్తాయి అని అంటున్నారు. అయితే ఈ తేనే మరియు మిరియాల మదుమేహం మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తాయి. దీనికోసం చిటికెడు నల్లమిరియాలను తేనె లో కలిపి తిన్న తర్వాత ఒక అరగంట పాటు నీళ్లు తాగవద్దు. మీరు గనక ఇలా చేస్తే గొంతు కఫం మరియు నోటి దుర్వాసన, దగ్గు, ఛాతి బిగుతు లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి అని అంటున్నారు…
తేనెలో నల్ల మిరియాలు కొద్దిగా తులసి రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు అనేవి దూరం అవుతాయి. అలాగే శ్వాసనాళ్ళం లో వాపును కూడా తగ్గిస్తుంది. ఇది శ్వాసకోశాన్ని క్లీన్ చేయడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అంతేకాక బరువు పెరుగుతున్నామనే సమస్యతో ఇబ్బంది పడే వారికి కూడా తేనే మరియు మిరియాలు ఎంత హెల్ప్ చేస్తాయి. అయితే ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటి లో కలిపి తీసుకుంటే బరువు ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.