Mahindra BE 6e - XEV 9E : రెండు బ్లాస్టింగ్ కార్లు లాంచ్ చేసిన మహీంద్రా.. ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ ల తేడా ఇదే..!
Mahindra BE 6e – XEV 9E : ఈ రోజుల్లో కారు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. కొందరు లక్షల్లో కారు కొడుతుంటే, మరి కొందరు కోట్లు ఖర్చు పెడుతున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం)… తన ఎలక్ట్రిక్ వాహన పోర్టుఫోలియోను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా బీఈ 6ఈ, ఎక్స్‌ఈవీ 9ఈ పేరుతో రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. ఈ ఎంట్రీ లెవల్ వేరియంట్స్ ధరలు వరుసగా రూ.18.9 లక్షలు, రూ.21.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నుంచి ఈ కార్ల డెలివరీ ప్రారంభమవుతాయి. బీఈ 6ఈ ఒకసారి చార్జింగ్‌తో 682 కిలోమీటర్లు, ఎక్స్‌ఈవీ 9ఈ 656 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని కంపెనీ తెలిపింది.
Mahindra BE 6e – XEV 9E : రెండు బ్లాస్టింగ్ కార్లు లాంచ్ చేసిన మహీంద్రా.. ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ ల తేడా ఇదే..!
మహీంద్రా భారతదేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. 59 కేడబ్ల్యూహెచ్, 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లలో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈని కొనుగోలు చేయవచ్చు. 79 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ఏకంగా 656 కిలోమీటర్ల రేంజ్‌ను డెలివర్ చేయనుంది. మహీంద్రా బీఈ 6ఈ ఎక్స్ షోరూం ధర రూ.18.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన డెలివరీలు కూడా 2025లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.59 కేడబ్ల్యూహెచ్, 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో మహీంద్రా బీఈ 6ఈని కొనుగోలు చేయవచ్చు. వీటిలో 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ మోడల్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 682 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.
ఈ రెండు కార్లూ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. ఫాస్ట్ ఛార్జర్ల ద్వారా 20 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ కేవలం 20 నిమిషాల్లోనే ఎక్కనున్నాయి.ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు కూపే లాంటి రూఫ్‌ను కలిగి ఉంది. కనెక్టెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్), ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, మెరిసే లోగో, పియానో బ్లాక్ క్లాడింగ్, సీ-పిల్లర్‌పై రియర్ డోర్ హ్యాండిల్స్, ఏరో ఇన్సర్ట్స్‌తో కూడిన 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెనా, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్లు ఉన్నాయి. కారు ఇంటీరియర్ విషయానికొస్తే ఇది పెద్ద, విలాసవంతమైన క్యాబిన్, ట్రిపుల్ స్క్రీన్ సెటప్, పెద్ద లోగోతో 2-స్పోక్ స్టీరింగ్ వీల్, రూఫ్ గ్లాస్‌తో కలిగి ఉంటుంది.సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే 2025 మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇలో 7 ఎయిర్‌బ్యాగులు, ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ సిస్టమ్ ఉన్నాయి
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…
This website uses cookies.