Jamun Seeds : ఈ మధ్యకాలంలో విత్తనాల ప్రాధాన్యత అనేది చాలా బాగా పెరిగిపోయింది. కేవలం పండ్లు మాత్రమే తిని గింజలను పడేసేవారు. కానీ ఇప్పటి కాలంలో పండు లోపల విత్తనాలను కూడా వాడుతున్నారు. అలాగే పండ్లతో పాటుగా విత్తనాలలో ఉండే పోషకాలను కూడా తీసుకుంటున్నారు. అలాగే నేరేడు పండ్ల విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే నేరేడు పండ్లను తిని వాటి యొక్క విత్తనాలను పారేస్తూ ఉంటారు. కానీ ఇక మీదట అలా చేయకండి. వీటిలో కూడా శరీరానికి ఎంతో అవసరం అయ్యే పోషకాలు దాగి ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే నేరేడు పండు యొక్క గింజలలో ఉన్న లాభాలు తెలిస్తే, మీరు ఈసారి నేరేడు పండ్లను తిన్నప్పుడు గింజలు పారేయకుండా దాచుకుంటారు. మరీ ఈ నేరేడు గింజలలో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి.? వీటితో ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
బీ పీ కంట్రోల్ : ఈ నేరేడు పండ్ల గింజలను తీసుకోవడం వలన బీపీ అదుపులో ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది హై బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వారు నేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే దీనిలో ఎలాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. అలాగే ఇది బీపీని కూడా నార్మల్ చేస్తుంది…
ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇటువంటి వారు నేరేడు పండ్లను తీసుకున్న లేక గింజలను తీసుకున్న సరే ఈజీగా బరువు తగ్గుతారు. ఇవి బరువును తగ్గించడంలో ఎంతో చక్కగా పనిచేస్తాయి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది…
రక్తం శుభ్రం : నేరేడు గింజలను తీసుకోవడం వలన శరీరంలో ఉండే రక్తం క్లీన్ అవుతుంది. ఎందుకు అంటే దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను నియంత్రించడమే కాక విష పదార్థాలను మరియు మలినాలను బయటకు పంపిస్తుంది. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ రానీయకుండా చూస్తుంది…
విష పదార్థాలు బయటకు : శరీరంలో ఉండే మలినాలను మరియు విష పదార్థాలను బయటకు పంపించి బాడీ డిటాక్స్ చేయడంలో ఈ నేరేడు గింజలు ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే చెమట రూపంలో మలినాలను కూడా బయటకు పంపిస్తాయి.
షుగర్ కంట్రోల్ : గింజలను తీసుకోవటం వలన షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. వీటిలో జంబో లైన్ మరియు జంబో సెన్స్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ ను పెరగకుండా తగ్గిస్తాయి. అలాగే ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అయ్యేలా కూడా చేస్తాయి. ఇలా ఈ గింజలతో ఎన్నో లాభాలు ఉన్నాయి…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
This website uses cookies.