Jamun Seeds : నేరేడు పండ్లను తిని గింజలు పారేస్తున్నారా… ఈ విషయాలు తెలిస్తే… అస్సలు పడేయరు…??

 Authored By ramu | The Telugu News | Updated on :25 October 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Jamun Seeds : నేరేడు పండ్లను తిని గింజలు పారేస్తున్నారా... ఈ విషయాలు తెలిస్తే... అస్సలు పడేయరు...??

Jamun Seeds : ఈ మధ్యకాలంలో విత్తనాల ప్రాధాన్యత అనేది చాలా బాగా పెరిగిపోయింది. కేవలం పండ్లు మాత్రమే తిని గింజలను పడేసేవారు. కానీ ఇప్పటి కాలంలో పండు లోపల విత్తనాలను కూడా వాడుతున్నారు. అలాగే పండ్లతో పాటుగా విత్తనాలలో ఉండే పోషకాలను కూడా తీసుకుంటున్నారు. అలాగే నేరేడు పండ్ల విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే నేరేడు పండ్లను తిని వాటి యొక్క విత్తనాలను పారేస్తూ ఉంటారు. కానీ ఇక మీదట అలా చేయకండి. వీటిలో కూడా శరీరానికి ఎంతో అవసరం అయ్యే పోషకాలు దాగి ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే నేరేడు పండు యొక్క గింజలలో ఉన్న లాభాలు తెలిస్తే, మీరు ఈసారి నేరేడు పండ్లను తిన్నప్పుడు గింజలు పారేయకుండా దాచుకుంటారు. మరీ ఈ నేరేడు గింజలలో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి.? వీటితో ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

బీ పీ కంట్రోల్ : ఈ నేరేడు పండ్ల గింజలను తీసుకోవడం వలన బీపీ అదుపులో ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది హై బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వారు నేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే దీనిలో ఎలాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. అలాగే ఇది బీపీని కూడా నార్మల్ చేస్తుంది…

Jamun Seeds వెయిట్ లాస్

ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇటువంటి వారు నేరేడు పండ్లను తీసుకున్న లేక గింజలను తీసుకున్న సరే ఈజీగా బరువు తగ్గుతారు. ఇవి బరువును తగ్గించడంలో ఎంతో చక్కగా పనిచేస్తాయి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది…

రక్తం శుభ్రం : నేరేడు గింజలను తీసుకోవడం వలన శరీరంలో ఉండే రక్తం క్లీన్ అవుతుంది. ఎందుకు అంటే దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను నియంత్రించడమే కాక విష పదార్థాలను మరియు మలినాలను బయటకు పంపిస్తుంది. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ రానీయకుండా చూస్తుంది…

విష పదార్థాలు బయటకు : శరీరంలో ఉండే మలినాలను మరియు విష పదార్థాలను బయటకు పంపించి బాడీ డిటాక్స్ చేయడంలో ఈ నేరేడు గింజలు ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే చెమట రూపంలో మలినాలను కూడా బయటకు పంపిస్తాయి.

Jamun Seeds : నేరేడు పండ్లను తిని గింజలు పారేస్తున్నారా... ఈ విషయాలు తెలిస్తే... అస్సలు పడేయరు...??

Jamun Seeds : నేరేడు పండ్లను తిని గింజలు పారేస్తున్నారా… ఈ విషయాలు తెలిస్తే… అస్సలు పడేయరు…??

షుగర్ కంట్రోల్ : గింజలను తీసుకోవటం వలన షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. వీటిలో జంబో లైన్ మరియు జంబో సెన్స్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ ను పెరగకుండా తగ్గిస్తాయి. అలాగే ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అయ్యేలా కూడా చేస్తాయి. ఇలా ఈ గింజలతో ఎన్నో లాభాలు ఉన్నాయి…

Also read

Tags :

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి