Lemon Peels : నిమ్మ కాయలోనే కాదు నిమ్మ తొక్కలో కూడా బోలెడు ప్రయోజనాలు…!!
ప్రధానాంశాలు:
Lemon Peels : నిమ్మ కాయలోనే కాదు నిమ్మ తొక్కలో కూడా బోలెడు ప్రయోజనాలు...!!
Lemon Peels : మనం ఇంట్లో అధికంగా వాడే వాటిలలో నిమ్మకాయ కూడా ఒకటి అని చెప్పొచ్చు. అయితే ఈ నిమ్మకాయను మనం తరచుగా ఏదో ఒక పని రూపంలో వాడుతూనే ఉంటాము. అలాగే నిమ్మరసం తీసుకోవడం వలన కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం చాలా మందికి తెలిసినదే. అలాగే ఇది దాహాన్ని కూడా తీరుస్తుంది. అంతేకాక నిమ్మ రసం అనేది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. అలాగే ఎక్కువ రక్తపోటును తగ్గించడంలో కూడా చాలా చక్కగా పని చేస్తుంది. అయితే ఎంతో మంది నిమ్మరసం పిండిన తర్వాత వాటి యొక్క తొక్కలను పారేస్తూ ఉంటారు. కానీ వీటితో కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
నిమ్మ తొక్క కళ్ళకు కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ మరియు కెరోటి నాయిడ్స్ అనేవి కంటి చూపును ఎంతగానో మెరుగుపరుస్తాయి. అలాగే వృద్ధాప్యంలో కంటి సమస్యలను రాకుండా కూడా చేస్తుంది. అంతేకాక గాయాలను కూడా తొందరగా నయం చేయటంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అంతేకాక బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టడంలో కూడా ఈ నిమ్మ తొక్కలు ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. ఈ నిమ్మ చెక్కలను స్నానం చేసే ముందు చంక భాగంలో బాగా రుద్దితే చెమట వాసన మరియు దుర్వాసన అనేది రాదు.
అలాగే ఈ నిమ్మ తొక్కలను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే శరీరం అంతా కూడా ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే ఒత్తిడి కూడా దూరం అవుతుంది. అంతేకాక షుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవారు వారిలో వచ్చే అల్సార్ ను తొందరగా దూరం చేయటం లో కూడా ఈ నిమ్మ తొక్కలు చక్కగా ఉపయోగపడతాయి. అలాగే పుండ్లు ఉన్నచోట రుద్దితే తొందరగా తగ్గిపోతాయి. అంతేకాక నిమ్మ తొక్కలు మరిగించిన నీటితో ముఖాన్ని కడిగితే మొటిమలు అనేవి తగ్గి చర్మం ఎంతో అందంగా మెరుస్తుంది. ఇలా ఎన్నో రకాల లాభాలు నిమ్మ తొక్కలలో ఉన్నాయి