Lemon Peels : నిమ్మ తొక్కలను పడేస్తున్నారా.. వాటిలో ఉన్న ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Lemon Peels : నిమ్మ తొక్కలను పడేస్తున్నారా.. వాటిలో ఉన్న ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Lemon Peels : మనం చాలా రకాల పండ్లు కూరగాయలను తొక్కలు తీసేసి తింటారు. అలాంటి వాటిలో ఒకటి నిమ్మకాయ. నిమ్మకాయ తొక్కని కూడా మనం పడేస్తూ ఉంటాం. అయితే అలాంటి నిమ్మకాయ తొక్కలో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… నిమ్మకాయ జ్యూస్ తీసిన తర్వాత ఆ తొక్కలని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ ని కూరల్లో వాడుకోవచ్చు.. లేదా గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు తీసుకోవచ్చు.. […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 November 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  నిమ్మ తొక్కలను పడేస్తున్నారా..

  •  వాటిలో ఉన్న ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Lemon Peels : మనం చాలా రకాల పండ్లు కూరగాయలను తొక్కలు తీసేసి తింటారు. అలాంటి వాటిలో ఒకటి నిమ్మకాయ. నిమ్మకాయ తొక్కని కూడా మనం పడేస్తూ ఉంటాం. అయితే అలాంటి నిమ్మకాయ తొక్కలో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… నిమ్మకాయ జ్యూస్ తీసిన తర్వాత ఆ తొక్కలని ఎండబెట్టి పౌడర్ చేసి ఆ పౌడర్ ని కూరల్లో వాడుకోవచ్చు.. లేదా గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు తీసుకోవచ్చు.. ఈ విధంగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మకాయ తొక్కులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అది కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

నిమ్మ తోక్కల్లోని విటమిన్ సి తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగేలా చేస్తుంది. తెల్ల రక్త కణాలు క్యాన్సర్ కణాల అంతు చూస్తాయి. అందరికీ తెలిసిందే నిమ్మకాయలు ఉండే విటమిన్ సి ఏ కాల్షియం, ఫైబర్, పొటాషియంలు ఉంటాయి. అందులోనూ మనకు ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి.ఇది దంతాలు ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. కండరాల పనితనం మెరుగుపడుతుంది. హార్మోన్లు సరిగా పనిచేస్తాయి. క్యాన్సర్లను అడ్డుకునే పవర్ఫుల్ ఔషధ గుణాలు నిమ్మకాయ తొక్కులో ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల హై బీపీ తగ్గుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే అవి విటమిన్ ఏ గా మారుతాయి.

దీంతో నేత్ర సమస్యలు పోతాయి. అలాగే గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయి. నిమ్మకాయ తొక్కును సంకల్లో రుద్దుకుంటే చెమట దుర్వాసన రాదు.. ఈ తొక్కను ముఖంపై రుద్దుకుంటే నిమ్మకాయ మొటిమలు పోతాయి. తొక్కుతో జ్యూస్ చేసుకుని తాగితే కలరా వ్యాధి సైతం తగ్గిపోతుంది. అలాగే ఈ జ్యూస్ లకు దోమల లార్వాను చంపే శక్తి కూడా ఉంది. వాటిపై ఈ జ్యూస్ ను స్ప్రే చేస్తే చాలు దోమల ఉత్పత్తి ఆగిపోతుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది