Pistachio : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉంటాము. అయితే వీటిలో పిస్తా పప్పు కూడా ఒకటి. ఈ పప్పులు అధికంగా స్వీట్లు తయారీలో వాడతారు. అయితే ఈ పిస్తా పప్పులో విటమిన్లు మరియు విటమిన్ b6 లాంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఈ పిస్తా పప్పులో మెగ్నీషియం మరియు ఫాస్పరస్, పొటాషియం లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని బలపరచడమే కాక గుండే ను ఎంతో శక్తివంతంగా మార్చటానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఈ పిస్తా పప్పులు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరానికి ఫైబర్ మరియు ప్రోటీన్ అందుతాయి. దీంతో శరీర కండరాల నిర్మాణంలో మార్పులు రావటమే కాకుండా జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. అలాగే పిస్తా పప్పులో ఉన్నటువంటి మోనో శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను కూడా కరిగిస్తాయి. దీంతో గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది…
ఈ పిస్తా పప్పులో ఎంతో శక్తివంతమైన ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంపై ఎంతో ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించి శరీర బరువు అదుపులో ఉంచడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే మలబద్ధకం లాంటి సమస్యలను కూడా నివారిస్తుంది. మీరు బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తుంటే మీ ఆహారంలో కచ్చితంగా పిస్తా పప్పులు చేర్చుకోవాలి అని డైటీషియల్ చెబుతున్నారు. అలాగే పిస్తా పప్పులో కాల్షియంతో పాటుగా మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది.
ప్రతిరోజు వీటితో తయారు చేసిన పౌడర్ ని కలుపుకొని తాగటం వలన ఎముకలు బలంగా తయారవుతాయి. దీని కారణం చేత ఆస్టియోపోరోసిస్ లాంటి ఎముకల వ్యాధులు కూడా దరి చేరకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పిస్తా పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి కావున రోజు వీటిని తీసుకోవడం వలన చర్మం అందంగా మెరుస్తుంది. అంతేకాక ముఖంపై మచ్చలు మరియు ఇతర సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ పిస్తా పలుకులు తీసుకుంటే మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా…
Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో…
Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక…
Work From Home Jobs : ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎంత…
Telangana : తెలంగాణలో నిరుద్యోగ యువత పెరిగింది. నిరుద్యోగంలో దేశంలో రాష్ట్రం ముందుంది. రాష్ట్రంలోని 15 నుండి 29 సంవత్సరాల…
Nagula Chavithi : కార్తీక మాసంలో శుద్ధ శుక్ల పక్ష చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది…
This website uses cookies.