Pistachio : బరువు తగ్గాలనుకునే వారికి ఈ పప్పు దివ్య ఔషధం… ఎలాగో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pistachio : బరువు తగ్గాలనుకునే వారికి ఈ పప్పు దివ్య ఔషధం… ఎలాగో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :4 November 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Pistachio : బరువు తగ్గాలనుకునే వారికి ఈ పప్పు దివ్య ఔషధం... ఎలాగో తెలుసా...!!

Pistachio : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉంటాము. అయితే వీటిలో పిస్తా పప్పు కూడా ఒకటి. ఈ పప్పులు అధికంగా స్వీట్లు తయారీలో వాడతారు. అయితే ఈ పిస్తా పప్పులో విటమిన్లు మరియు విటమిన్ b6 లాంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఈ పిస్తా పప్పులో మెగ్నీషియం మరియు ఫాస్పరస్, పొటాషియం లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని బలపరచడమే కాక గుండే ను ఎంతో శక్తివంతంగా మార్చటానికి కూడా హెల్ప్ చేస్తాయి. ఈ పిస్తా పప్పులు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరానికి ఫైబర్ మరియు ప్రోటీన్ అందుతాయి. దీంతో శరీర కండరాల నిర్మాణంలో మార్పులు రావటమే కాకుండా జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగుపడుతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. అలాగే పిస్తా పప్పులో ఉన్నటువంటి మోనో శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను కూడా కరిగిస్తాయి. దీంతో గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది…

ఈ పిస్తా పప్పులో ఎంతో శక్తివంతమైన ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంపై ఎంతో ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించి శరీర బరువు అదుపులో ఉంచడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే మలబద్ధకం లాంటి సమస్యలను కూడా నివారిస్తుంది. మీరు బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తుంటే మీ ఆహారంలో కచ్చితంగా పిస్తా పప్పులు చేర్చుకోవాలి అని డైటీషియల్ చెబుతున్నారు. అలాగే పిస్తా పప్పులో కాల్షియంతో పాటుగా మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది.

Pistachio బరువు తగ్గాలనుకునే వారికి ఈ పప్పు దివ్య ఔషధం ఎలాగో తెలుసా

Pistachio : బరువు తగ్గాలనుకునే వారికి ఈ పప్పు దివ్య ఔషధం… ఎలాగో తెలుసా…!!

ప్రతిరోజు వీటితో తయారు చేసిన పౌడర్ ని కలుపుకొని తాగటం వలన ఎముకలు బలంగా తయారవుతాయి. దీని కారణం చేత ఆస్టియోపోరోసిస్ లాంటి ఎముకల వ్యాధులు కూడా దరి చేరకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పిస్తా పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి కావున రోజు వీటిని తీసుకోవడం వలన చర్మం అందంగా మెరుస్తుంది. అంతేకాక ముఖంపై మచ్చలు మరియు ఇతర సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ పిస్తా పలుకులు తీసుకుంటే మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది