Pomegranate Leaves : దానిమ్మ పండు లో మాత్రమే కాదు… వాటి ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…!
Pomegranate Leaves : దానిమ్మ పండు తినటం ఆరోగ్యానికి మంచిది అనే సంగతి మన అందరికీ తెలిసినదే. కానీ పండు మాత్రమే కాదు దాని యొక్క ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇది మాత్రం నిజం. వీటిని ఆయుర్వేదంలో కూడా ఇతర రకాల వ్యాధులను నయం చేయటంలో వాడతారు. మనకు తరచుగా వచ్చే దగ్గు మరియు జలుబు లాంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ […]
ప్రధానాంశాలు:
Pomegranate Leaves : దానిమ్మ పండు లో మాత్రమే కాదు... వాటి ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా...!
Pomegranate Leaves : దానిమ్మ పండు తినటం ఆరోగ్యానికి మంచిది అనే సంగతి మన అందరికీ తెలిసినదే. కానీ పండు మాత్రమే కాదు దాని యొక్క ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇది మాత్రం నిజం. వీటిని ఆయుర్వేదంలో కూడా ఇతర రకాల వ్యాధులను నయం చేయటంలో వాడతారు. మనకు తరచుగా వచ్చే దగ్గు మరియు జలుబు లాంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ పండు యొక్క ఆకుల తో కషాయాన్ని తయారు చేసుకుని రోజుకు రెండుసార్లు తాగాలి. ఇవి మాత్రమే కాకుండా ఇతర చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు కూడా దానిమ్మ ఆకులు ఎంతగానో పని చేస్తాయి. అయితే దానిమ్మ ఆకుల ప్రయోజనాలు ఏమిటో చూద్దాం…
– ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను కుష్టు వ్యాధి మరియు చర్మ వ్యాధులను తగ్గించేందుకు వాడతారు…
– ఈ ఆకులు అనేవి నిద్రలేమికి బెస్ట్ రెమెడీ అని కూడా చెప్పవచ్చు. అయితే ఒక పాత్రలో 3 వంతుల వరకు నీళ్లు తీసుకోవాలి. ఆ తర్వాత దానిమ్మ ఆకులను పేస్టులా చేసి ఆ పేస్టును నీళ్ళ ల్లో వేసి వాటర్ సగం వరకు వచ్చేదాక మరిగించాలి. తర్వాత రోజు పడుకునే ముందు ఈ వాటర్ ను ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఈ వాటర్ మీకు నిద్రలేమి సమస్య నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే రాత్రి బాగా నిద్రపోయేందుకు కూడా హెల్ప్ చేస్తుంది…
– మీరు గనక దురద మరియు తామర లాంటి చర్మ సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటే, దానిమ్మ ఆకులతో పేస్ట్ తయారు చేసుకొని దానిని ఒంటికి పట్టించుకుంటే దురద తొందరగా నయమవుతుంది. అంతేకాక శరీరంలోని పుండ్లు మరియు గాయాలకు కూడా ఈ పేస్టు రాసుకుంటే తొందరగా తగ్గుతాయి.
– చెవి ఇన్ఫెక్షన్లు మరియు చెవి నొప్పితో బాధపడే వారు కూడా దానిమ్మ ఆకులతో చూర్ణం చేసి దాని నుండి రసాన్ని తీసి ఆ రసాన్ని నువ్వుల నూనె లేక ఆముదం నూనెలో కలిపి ఈ మిశ్రమాన్ని రెండు చెవులలో వేసుకోవాలి. మీరు గనక ఇలా చేసినట్లయితే చెవి నొప్పి మరియు ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం పొందవచ్చు…
– ఎవరికైనా నోటి దుర్వాసన మరియు చిగుళ్ల సమస్యలు, నోటి పూత ఉంటే దానిమ్మ ఆకుల రసాన్ని నీటిలో కలుపుకొని ఆ నీటితో నోరు పుక్కిలించాలి. మీరు కనుక ఇలా చేస్తే నూటికి సంబంధించిన సమస్యల నుండి కూడా బయటపడతారు…
– అలాగే ముఖంపై ఉన్నటువంటి మొటిమలు తగ్గాలి అంటే దానిమ్మ ఆకులను పేస్టులా చేసుకుని మొటిమల దగ్గర రాస్తే ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు…
– మీరు ఎప్పుడు బలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ లాంటి సమస్యలతో బాధపడితే, నిత్యం రెండు టీ స్పూన్ల దానిమ్మ రసాన్ని తాగండి లేక ఈ ఆకుల తో జిలకర్ర మరియు మిరియాలతో మెత్తగా చేసుకొని పెరుగులో కలుపుకొని తాగాలి…