
Health Benefits of teeth
Health Benefits : కొంతమంది మనస్ఫూర్తిగా నవ్వలేరు. వారికి ఎటువంటి కష్టాలు లేకపోయినా మనస్ఫూర్తిగా నవ్వలేరు. అయితే ఇక్కడ నవ్వడం నవ్వకపోవడం అనే దానికంటే కూడా మన నోటికి సంబంధించిన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. పళ్ళను మనం ఆరోగ్యంగా చూసుకోకపోతే ఏ ఆహార పదార్థాలు కూడా సరిగా తినలేము. అలాగే దంతాల రంగు మారిపోయి నోటి నుంచి దుర్వాసన వస్తున్న చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్న అది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పైసా ఖర్చు పెట్టకుండా ఎటువంటి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా పళ్ళను రిమూవ్ చేసుకోకుండా మన వంటింట్లో దొరికే ఇంగ్రిడియంట్స్ తో సింపుల్గా తయారు చేసుకునే ఒక హోం రెమిడీ చెప్పబోతున్నాము.. దంతాలు రంగు మారిపోతాయి.
ఇది రూపాన్ని పాడు చేయడం కాకుండా నవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఏ పదార్థాలు తినడం వల్ల దంతాలు పాడవుతాయో తెలుసుకుందాం. చలికాలం అయినా వేసవి కాలమైన అందరూ టీ తాగడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది టీ ఎక్కువగా తాగుతుంటారు. ఇది దంతాలకు మంచిది కాదు. కాఫీ కంటే కూడా దంతాల మీద చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఇది దంతాలపై ఉండే ఎనామిల్లి దెబ్బతీస్తుంది. దీని కారణంగా దంతాలు పసుపు రంగులోకి మారడం ప్రారంభమవుతాయి. స్వీట్ ఎక్కువగా తినడం దంతాలకు మంచిది కాదు. దీని కారణంగా నాలుక రంగు మారుతుంది. అలాగే మిఠాయి లేదా స్వీట్లు దంతాలపై మరకలను వదిలేస్తాయి. అందుకే స్వీట్లు తగ్గిస్తే మంచిది. మనం ఇప్పుడు పళ్ళను తెల్లగా చేసుకుని అద్భుతమైన హోమ్ రెమిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి.
Health Benefits of teeth
ఇలా వెల్లుల్లి రెబ్బలను చిన్న రొట్లే వేసి దంచిన తరువాత ఒక బౌల్ లోకి తీసుకోండి. వెల్లుల్లి మనం పంటిని ఎంత బాగా శుభ్రం చేస్తుంది. అంటే దంతాలకు పట్టిన గారను నోటి దుర్వాసనను తగ్గించడంలో మనకు వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. ఈ బేకింగ్ సోడా మన పంటి గారను చాలా చక్కగా క్లీన్ చేస్తుంది. ఇప్పుడు టూత్ పేస్ట్ తీసుకోవాలి. అంటే పూర్తిగా వైట్ కలర్ లో ఉండే టూత్ పేస్ట్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక టమాటో తీసుకుని హాఫ్ గా కట్ చేసి నిమ్మకాయ పిండినట్టు ఒక స్పూన్ లోకి టమాటో రసాన్నిపిండి స్పూన్ వరకు కలెక్ట్ చేసుకున్న టమాటో రసాన్ని ఈ బౌల్లో వేసి మొత్తం అన్ని ఒకసారి బాగా కలపండి.
ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపారు కదా.. మీరు ప్రతి రోజు బ్రష్ చేసుకోవడానికి ఎంత మోతాదులో బ్రష్ మీద బెస్ట్ అప్లై చేసుకుంటారో అంత మోతాదులో తీసుకుని పళ్ళను బాగా శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకునేటప్పుడు కనీసం మూడు నిమిషాల పాటు పైకి కిందకి బ్రష్ చేయాలి.. ఈ రెమెడీని తయారు చేసుకుని మీరు బ్రష్ చేసుకున్నట్లయితే మీ పంటి సంబంధిత సమస్యలన్నీ కూడా పోతాయి. పళ్ళలో ఇరుక్కున్న ప్రతి విధమైన ఆహార పదార్థాలు బయటికి వెళ్లిపోయి మీ పళ్ళు చక్కగా క్లీన్ అయిపోతాయి. అయితే ఇది రెండు పూటలా మీరు చేయాల్సి ఉంటుంది. మీ పళ్ళను ఈ రెమెడీతోనే శుభ్రం చేసుకోండి.. గార పట్టిన మీ పళ్ళు తెల్లగా మారుతాయి.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.