Jaggery Tea : చాలామంది ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు.ఉదయం లేచిన దగ్గరనుంచి సాయంత్రం వరకు గంటకొకసారి టీ తాగుతూనే ఉంటారు. చాయ్ లేకుంటే వారికి రోజులో ఏ పని అవ్వదు. ఇలా రోజుకి ఎన్నోసార్లు టీ ని ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే చక్కెర చాయ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది క్రమంగా మధుమేహం, ఊబకాయం లాంటి వ్యాధుల్ని వచ్చేలా చేస్తాయి. ఇలా చాలాసార్లు టీ తీసుకోవడం వల్ల దానిలో ఉన్న షుగర్ శాతం క్యాలరీలు మన శరీరంలోనికి వెళ్లేలా చేస్తాయి. శరీరంలో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల శరీర బరువు గణనీయంగా పెరిగిపోతుంది. అయితే టీలో షుగర్ కి బదులుగా బెల్లం వాడడం వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి.
బెల్లం టీ రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనం కరంగా ఉంటుంది. బెల్లం టీ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రక్తహీనత సమస్యకు చెక్ : కొంతమంది ఎన్నో కారణాల వల్ల రక్తహీనతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిని తగ్గించుకోవడం కోసం పాలు బెల్లం టీ ఉత్తమ పరిష్కారం. బెల్లం లోనే ఐరన్ కంటెంట్ కారణంగా బెల్లం టీ తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఈ టీలో బెల్లంతో పాటు కొద్దిగా అల్లం, మిరియాలు వేసుకొని త్రాగడం వలన మన శరీరంలోని రోగనిరోదక శక్తి
మెరుగుపడటంతో పాటు ఇతర ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే వ్యాధులతో పోరాడడానికి నిరోధక శక్తి చాలా బాగా సహాయపడుతుంది. బెల్లంలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ కూడా నశింపజేస్తుంది.. బరువు తగ్గడం : బరువు తగ్గే క్రమంలో కొంతమంది టీ తాగడం మానేస్తుంటారు. అయితే చక్కెరకు బదులు బెల్లం టీ తాగితే శరీరంలోని క్యాలరీలు తగ్గుతాయి. ఇది బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది.. జీర్ణ క్రియ : బెల్లంలోని ఖనిజాలు, విటమిన్లు అన్ని రకాల ఆరోగ్య ఉపయోగాలను కలగజేస్తుంది. బెల్లం టీ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల ఎన్నో పొట్ట సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.