Jaggery Tea : ఈ బెల్లం టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే ఇక తాగడం మొదలు పెడతారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jaggery Tea : ఈ బెల్లం టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే ఇక తాగడం మొదలు పెడతారు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 February 2023,8:00 pm

Jaggery Tea : చాలామంది ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు.ఉదయం లేచిన దగ్గరనుంచి సాయంత్రం వరకు గంటకొకసారి టీ తాగుతూనే ఉంటారు. చాయ్ లేకుంటే వారికి రోజులో ఏ పని అవ్వదు. ఇలా రోజుకి ఎన్నోసార్లు టీ ని ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే చక్కెర చాయ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది క్రమంగా మధుమేహం, ఊబకాయం లాంటి వ్యాధుల్ని వచ్చేలా చేస్తాయి. ఇలా చాలాసార్లు టీ తీసుకోవడం వల్ల దానిలో ఉన్న షుగర్ శాతం క్యాలరీలు మన శరీరంలోనికి వెళ్లేలా చేస్తాయి. శరీరంలో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల శరీర బరువు గణనీయంగా పెరిగిపోతుంది. అయితే టీలో షుగర్ కి బదులుగా బెల్లం వాడడం వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి.

health benefits of this jaggery tea

health benefits of this jaggery tea

బెల్లం టీ రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనం కరంగా ఉంటుంది. బెల్లం టీ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రక్తహీనత సమస్యకు చెక్ : కొంతమంది ఎన్నో కారణాల వల్ల రక్తహీనతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిని తగ్గించుకోవడం కోసం పాలు బెల్లం టీ ఉత్తమ పరిష్కారం. బెల్లం లోనే ఐరన్ కంటెంట్ కారణంగా బెల్లం టీ తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఈ టీలో బెల్లంతో పాటు కొద్దిగా అల్లం,  మిరియాలు వేసుకొని త్రాగడం వలన మన శరీరంలోని రోగనిరోదక శక్తి

Jaggery Tea : బెల్లం టీని తాగుతున్నారా.. లేదా.. బోలెడు లాభాలు పొంద‌వ‌చ్చు..

మెరుగుపడటంతో పాటు ఇతర ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే వ్యాధులతో పోరాడడానికి నిరోధక శక్తి చాలా బాగా సహాయపడుతుంది. బెల్లంలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ కూడా నశింపజేస్తుంది.. బరువు తగ్గడం : బరువు తగ్గే క్రమంలో కొంతమంది టీ తాగడం మానేస్తుంటారు. అయితే చక్కెరకు బదులు బెల్లం టీ తాగితే శరీరంలోని క్యాలరీలు తగ్గుతాయి. ఇది బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది.. జీర్ణ క్రియ : బెల్లంలోని ఖనిజాలు, విటమిన్లు అన్ని రకాల ఆరోగ్య ఉపయోగాలను కలగజేస్తుంది. బెల్లం టీ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల ఎన్నో పొట్ట సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

  1. "Today Gold Price on January 30th 2026 : పసిడి ప్రియులకు భారీ షాక్..ఏకంగా రూ.11 వేలకు పైగా పెరిగిన బంగారం..ఈరోజు ఎంతంటే !"

  2. "Brahmamudi Today Episode Jan 30 : బ్రహ్మముడి జనవరి 30 ఎపిసోడ్: రాజ్, కావ్యలకు అడ్డంగా దొరికిపోయిన ధర్మేంద్ర.. కావ్య ధైర్యానికి ధర్మేంద్ర షాక్.. ఇంటిలో హై టెన్షన్.. రాజ్ పరిస్థితి ఏంటి?"

  3. "Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం 2 జనవరి 30 ఎపిసోడ్: జ్యోత్స్నకు షాకిచ్చిన పారిజాతం.. జ్యోత్స్న పాపం పండిందా? పారిజాతం తీసుకున్న నిర్ణయం ఏంటి? శ్రీధర్ ఎమోషనల్..!"

  4. "Samsung Galaxy S26 : గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న శాంసంగ్ Galaxy S26 Ultra ధర? లీకైన వివరాలు ఇవే!"

  5. "Guava : వీరు ఎట్టి పరిస్థితుల్లో జామపండు తినకూడదు..! ఏమికాదులే అని తిన్నారో అంతే సంగతి !!"