Triphala Tea : రోజుకు ఒక కప్పు త్రిఫల టీ తాగితే చాలు… ఎన్ని లాభాలో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Triphala Tea : రోజుకు ఒక కప్పు త్రిఫల టీ తాగితే చాలు… ఎన్ని లాభాలో…!

Triphala Tea : ఉదయాన్నే చాలా మందికి ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు పాల టీ లేక గ్రీ టీ తాగినిదే ఆ రోజంతా ఏదో వెలితిగా ఉంటుంది. అయితే ఎంతో బలమైన రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవాలి అనుకుంటే పాల టీ కి బదులుగా త్రిఫల టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు అంటున్నారు. ఈ టీ అనేది మిమ్మల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచటంతో పాటుగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2024,11:00 am

Triphala Tea : ఉదయాన్నే చాలా మందికి ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు పాల టీ లేక గ్రీ టీ తాగినిదే ఆ రోజంతా ఏదో వెలితిగా ఉంటుంది. అయితే ఎంతో బలమైన రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవాలి అనుకుంటే పాల టీ కి బదులుగా త్రిఫల టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు అంటున్నారు. ఈ టీ అనేది మిమ్మల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచటంతో పాటుగా ఎన్నో రకాల వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అయితే ఈ త్రిఫల టీ ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి అనేది నిజంగానే పెరుగుతుందా అనే సందేహం చాలా మందికి ఉన్నది. నిజం చెప్పాలి అంటే. ఈ త్రిఫల టీ లో యాంటీ ఆక్సిడెంట్ స్థాయి అనేది అధికంగా ఉంటుంది. అలాగే డిటాక్సి ఫైయింగ్, యాంటీ ఇన్ ప్లమెంటరీ లక్షణాలతో పాటు ఎన్నో పోషకాలు దీనిలో అధికంగా ఉన్నాయి. త్రిఫల అనగా ఉసిరి మరియు కరక్కాయ, తానికాయలు అనే మూడు పండ్ల మిశ్రమం. ఇది ఆయుర్వేద గ్రంధాలలో ఒక ముఖ్యమైన అంశంగా చెప్పొచ్చు. ఈ త్రిఫల టీ ని తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…

ఉసిరికాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇవి ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు నిలయం అని చెప్పొచ్చు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఉన్న నిర్వీషికరణ లక్షణాలు మొత్తం ఆరోగ్యాన్ని బలంగా చేసేందుకు సహాయపడతాయి. అలాగే కరక్కాయ మరియు తానికాయలో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ తటస్థం చేసేందుకు మరియు ఆక్సికరణ ఒత్తిడి నియంత్రించడానికి, రొగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. త్రిఫల అనేది శరీరాన్ని నిర్విషికరణ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్వహించేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ త్రిఫల లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి శరీరం యొక్క ఇన్ఫెక్షలతో పోరాడేందుకు సహాయపడుతుంది…

Triphala Tea రోజుకు ఒక కప్పు త్రిఫల టీ తాగితే చాలు ఎన్ని లాభాలో

Triphala Tea : రోజుకు ఒక కప్పు త్రిఫల టీ తాగితే చాలు… ఎన్ని లాభాలో…!

Triphala Tea త్రిఫల టీ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం

త్రిఫల టీ ని తయారు చేసేందుకు కొన్ని దశలను పాటించాలి. త్రిపాల పొడి 1 స్పూన్, ఒక కప్పు నీరు, తగినంత తేనె లేక నిమ్మకాయ చాలా అవసరం. ఎలా చేయాలి అంటే. ముందు ఒక కప్పు వాటర్ ను తీసుకొని మీడియం వేడి మీద ఈ నీటిని మరిగించాలి. ఈ నీళ్లు మరిగిన తర్వాత త్రిఫల పొడిని ఈ నీటిలో వేసి కలుపుకోవాలి. దాని తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు మూత పెట్టి వాటిని పక్కన పెట్టాలి. అప్పుడు త్రిఫల పౌడర్ యొక్క సమ్మేళనాలు అనేవి ఆ నీటిలో కరుగుతాయి. ఇప్పుడు టీ ని వడకట్టుకొని కప్పు లో పోసుకొని రుచి కోసం దానిలో నిమ్మరసం లేక తేనె కలుపుకొని తీసుకుంటే చాలు…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది