Guava Benefits : జామ పండ్లు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి డైట్లో పండ్లను తినడం తప్పనిసరి. ఒక్కొక్క పండు ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కొన్ని పండ్లు సీజనల్ గా దొరుకుతాయి. మరికొన్ని సీజన్ తో సంబంధం లేకుండా దొరుకుతాయి. వీటిలో జామపండు ముందు వరుసలో ఉంటుంది. జామకాయ తెలియని వారు ఉండరు. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా పెంచుకునే చెట్టు ఇది. ఇది చిన్న పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇష్టం. ఆకుపచ్చ రంగులో ఉండి నోరూరించే పండులో అనేక రకాలు ఉంటాయి. జామకాయ లోపల ఉండే గుజ్జు కొన్నింటిలో గులాబి రంగులో ఉంటుంది. మరికొన్నింటిలో తెలుపు రంగులో ఉంటుంది….
అయితే చాలామందికి జామకాయ తినేటప్పుడు కొన్ని సందేహాలు వచ్చి ఉంటాయి. తెలుపు రంగు ఉన్న జామ మంచిదా లేక గులాబీ రంగు గుజ్జు ఉన్న జామ మంచిదని సందేహాలు వస్తుంటాయి. అయితే నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాధారణంగా జామకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని నివారిస్తుంది. మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం అయ్యేలా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో జామకాయ బాగా సహాయపడుతుంది…
అలాగే జామ పండ్లలో ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగు జామలో నీటి శాతం ఎక్కువగా, చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. తక్కువ పిండి పదార్థాలు ,విటమిన్ సి ఉంటాయి. తెల్ల జామలో ఎక్కువ చక్కెర, స్టార్చ్, విటమిన్ సి, ఎక్కువ గింజలు ఉంటాయి. తెల్ల గుజ్జు జామలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎరుపు రంగు జామకాయలో ఇంకా ఎక్కువ శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎరుపు జామలో సహజంగా లభించే కెరోటినాయిడ్ పదార్థం ఉంటుంది. పింక్ జామ పండులను సూపర్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. వీటిలో విటమిన్స్ ఏ,సిల ఒమేగా త్రీ ఒమేగా 6, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. చక్కెర వ్యాధి ఉన్నవారికి జామకాయ బాగా ఉపయోగపడుతుంది.
Cardamom : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో యాలకులు కూడా ఒకటి. ఇది వంటలకు రుచిని మరియు…
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మంగళవారం భారతదేశపు అత్యధిక విలువ కలిగిన బ్యాంకు నోట్లపై ఒక విషయాన్ని…
Earthquake : హైదరాబాద్, మారుమూల ములుగు జిల్లా సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి కంపించింది. భద్రాద్రి-కొత్తగూడెం,…
Bananas : అరటి పండ్లను ఇష్ట పడని వారంటూ ఎవరు ఉండరు. పైగా ఇవి అన్ని సీజన్ లో ఈజీగా దొరుకుతాయి.…
Earthquake AP Telangana : హైదరాబాద్, మారుమూల ములుగు జిల్లా సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి…
Shivaji Maharaj : కాంతార సినిమాతో చరిత్ర సృష్టించిన కన్నడ హీరో రిషబ్ శెట్టి. కాంతార సినిమాతో కన్నడ, తెలుగుతోపాటు…
Neck Pain : సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి మెడనొప్పి అనేది బాగా వేధిస్తూ ఉంటుంది. అలాగే ఈ మెడ…
Chanakyaniti : ప్రతి ఒక్కరూ విజయాన్ని వేర్వేరుగా నిర్వచించినప్పటికీ, చాలా మంది కెరీర్లో విజయం అంటే మీరు మీ పనిలో…
This website uses cookies.