Pushpa 2 The Rule : పుష్ప 2 ప్రమోషన్స్ లో సుకుమార్ కనిపించడా.. అల్లు అర్జున్ ఒంటి చేత్తోనే.. ఈరోజు ట్రైలర్ ఈవెంట్ ఆమె స్పెషల్ ఎట్రాక్షన్..!
Pushpa 2 The Rule : అల్లు అర్జున్ సుకుమార్ కలిసి చేసిన పుష్ప 1 కి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ట్రైలర్ రిలీజ్ వేడుకకు వస్తున్న ఫ్యాన్స్ ని చూసి అర్ధం చేసుకోవచ్చు. పుష్ప 2 విషయంలో సుకుమార్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లెక్కకు మించి ఉండేలా చేస్తున్నాడట. ఐతే డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి డైరెక్టర్ సుకుమార్ మిస్ అవుతున్నాడని తెలుస్తుంది. సినిమాను అనుకున్న టైం కు తీసుకు రావాలంటే సుకుమార్ ఇలా ఈవెంట్స్ కి వస్తే పని అవ్వదని సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నాడట. ఇదే కాదు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తప్ప మిగతా ఏ ఈవెంట్స్ లో సుకుమార్ కనిపించడని తెలుస్తుంది. సినిమాను ఆడియన్స్ అంచనాలకు తగినట్టుగా సిద్ధం చేయాలని సుకుమార్ రిలీజ్ ముందు ఏ వేడుకకు రాకూడదని ఫిక్స్ అయ్యాడట.
నేడు పాట్నాలో జరుగుతున్న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బోజ్ పూరి యాక్ట్రెస్ అక్షరా సింగ్ తో స్పెషల్ పర్ఫార్మెన్స్ ని ఏర్పాటు చేస్తున్నారట. బోజ్ పూరీలో స్టార్ క్రేజ్ ఉన్న ఆమెతో పుష్ప 2ని మరింత జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పుష్ప 2 ప్రమోషన్స్ అన్నీ అల్లు అర్జున్ ఒంటి చేత్తో చేయాలని ఫిక్స్ అయ్యాడు.
Pushpa 2 The Rule : పుష్ప 2 ప్రమోషన్స్ లో సుకుమార్ కనిపించడా.. అల్లు అర్జున్ ఒంటి చేత్తోనే.. ఈరోజు ట్రైలర్ ఈవెంట్ ఆమె స్పెషల్ ఎట్రాక్షన్..!
సుకుమార్ ఏదైనా సినిమా రిలీజ్ తర్వాతే కనిపిస్తాడని తెలుస్తుంది. పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5న భారీ రిలీజ్ కాబోతుంది. Allu Arjun, Pushpa 2, Sukumar, Pushpa 2 promotions, Tollywood
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.