Health Benefits : మన హిందూ సంప్రదాయాల ప్రకారం రావి చెట్టును దేవతా వృక్షంగా పూజిస్తాం. ఎన్నెన్నో పూజలు, వ్రతాలు చేస్తూ.. ముడుపులు, తొట్లెటు కడుతుంటాం. కేవలం పూజలు, పునస్కారాలే కాకుండా ఎన్నో సమస్యలను తొలగించే ఆయుర్వేద మందుల్లోనూ దీనిని ఉపయోగిస్తుంటారు. రావి చెట్టులో ఉన్నన్ని మంచి గుణాలు మరెందులోనూ లేవని కూడా చెప్తుంటారు మన పెద్దలు. అలా పుట్టిందే… రావి చెట్టు లేని ఊరు, వేప చెట్టు లేని వీధి ఉండకూడదనే సామెత వచ్చింది. అయితే రావి చెట్టును అనేక ఆయుర్వేద మందుల్లో వాడి అనేక రకాల రోగాలను తగ్గించారు మన పూర్వీకులు. మన పురాణ గ్రంథాల్లో కూడా రావి చెట్టు వల్ల కల్గే ఉపయోగాల గురించి వివరించారు.
ఎన్నో అద్బుతమైన గుణాలు కల్గి ఉన్న ఈ చెట్టు అన్ని బాగాలు కఫ, పిత్త మరియు వాత దోషాల వచ్చే సమస్యలను తొలగిస్తుందట.రావి చెట్టు ఆకులు ఒక కఫహరమైన, మూత్ర విసర్జన, లేపనం వలె పని చేస్తాయి. ఈ ఆకుల రసం తాగడం వల్ల వికారం తగ్గుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. అంతే కాదండోయ్ రావి ఆకుల వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగవుతుంది. గోధుమ రంగులో, చిక్కగా మరియు ముట్టుకోవడానికి కఠినంగా ఉంటుందీ చెట్టు బెరడు. అయితే రావి బెరడులో విటామిన్ కె పుష్కలంగా లభిస్తుంది. ఈ బెరడు రసాన్ని డల్ స్కిన్ టోన్ పై అప్లై చేస్తే.. ఛాయను సమతుల్యం చేస్తుందట. అలాగే గాయాలు, పిగ్మెంటేషన్. మెటిమలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
అయితే ఒక రోజులో 2400 కిలోల ఆక్సిజన్ ను విడుదల చేసే ఈ చెట్టు కింద వేకువజామున గడపడం వల్ల ఆస్తమా సమస్యలు తగ్గిపోతాయట. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక రోగాలు నయం అవుతాయట.సేక్రెడ్ ఫిగ్ అని కూడా పిలువబడే ఈ రావి చెట్టు పండు తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ రసాలను ప్రేరేపించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఆకలి లేకుండా ఉండే వారు ఊదా రంగులో పండిన రావి పండ్లను తినడం వల్ల ఆకలి వేస్తుంది. అయితే ఒక గిన్నెలో రావి ఆకులను తీస్కొని వేడి చేయాలి. వెచ్చగా ఉన్నప్పుడు ఈ ఆకులు రసాన్ని స్వరిస్తాయి. ఈ రసాన్ని రెండు లేదా మూడు చుక్కలు చెవిలో వేయడం వల్ల చెవి నొప్పి తగ్గుతుందట. తాజా నిమ్మరసం, నెయ్యితో రావి చెట్టు బెరడు బూడిదను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గజ్జి, తామర, దురద వచ్చే చోటు రాయడం వల్ల ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.