Refined Wheat Flour : లొట్టలేసుకుంటూ మైదా పిండితో చేసిన వంటకాలు తింటున్నారా? తెల్ల విషం అది
Refined Wheat Flour : గోధుమ పిండి తెలుసు.. జొన్న పిండి తెలుసు.. రాగి పిండి తెలుసు కానీ.. మైదా పిండి ఏంటి? అసలు మైదా పిండి ఏ గింజల నుంచి వస్తుందో తెలుసా? గోధుమల నుంచి గోధుమ పిండి వస్తుంది. జొన్నల నుంచి జొన్న పిండి వస్తుంది. మరి మైదా పిండి ఎక్కడి నుంచి వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. గోధుమ పిండినే రిఫైన్ చేస్తే మైదా పిండి వస్తుంది. దీన్నే రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని కూడా అంటారు.
#image_title
హోటళ్లలో ఎక్కువగా ఈ పిండినే వాడుతారు. చపాతీల్లో కూడా ఈ పిండిని కలుపుతారు. పరోటాలు, బ్రెడ్స్ తయారీ అన్నింట్లో ఈ పిండే కీలకం. నిజానికి గోధుమల్లో ఉండే మనకు అవసరం అయ్యే ఫైబర్ మొత్తాన్ని తీసేసి రిఫైన్ చేస్తేనే ఈ పిండి వస్తుంది. అందుకే ఈ పిండితో చేసిన వంటకాలు తింటే ఫైబర్ శూన్యం. కానీ కార్బొహైడ్రేట్లు మాత్రం బాడీలోకి ఎక్కువగా వచ్చి చేరుతాయి. అందుకే మైదాను ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏం ఉండవు. నష్టాలు మాత్రం ఉంటాయి.. అని అంటున్నారు నిపుణులు.
Refined Wheat Flour : షుగర్ రావడం.. బరువు పెరగడం
ఈరోజుల్లో నూటికి తొంబై మందికి షుగర్ వస్తుంది. షుగర్ రాకముందు వేరు.. వచ్చాక వేరు. షుగర్ ఒక్కసారి వచ్చింది అంటే ఇక వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ రాని వాళ్లు కూడా రోజూ మైదా పిండితో చేసిన వంటకాలు తింటే దానిలో ఉండే గ్లైసీమిక్ ఇండెక్స్ వల్ల షుగర్ పెరిగే ప్రమాదం ఉంటుంది. దాని వల్ల షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
షుగర్ లేవల్స్ పెరగడమే కాదు.. ఊబకాయం కూడా వస్తుంది. కంటిన్యూగా మైదా పిండితో చేసిన పదార్థాలు తింటూ ఉంటే బరువు పెరుగుతారు. చివరకు అది ఊబకాయంగా మారుతుంది. కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉండే మైదా పిండిని ఇలా దీర్ఘకాలంగా తీసుకుంటూ ఉంటే షుగర్, బరువు లాంటి సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా ఎక్కువవుతాయి. అందుకే వీలైనంతగా మైదా పిండిని దూరం పెట్టండి. దాని బదులు మీ ఆహారంలో పండ్లను భాగంగా చేసుకోండి.