Home » Exclusive » Health Tips Of Pumpkin Juice
Exclusive

Health Tips : జీవితాంతం గ్యాస్, ఎసిడిటీ రాకుండా చేసే జ్యూస్ గురించి మీకు తెలుసా?

Authored By
pavan J
The Telugu News | Published on: March 7, 2022, 6:30 pm
Advertisement

Health Tips : మీరు తీసుకునే జ్యూస్ లలో పండ్ల కంటే ఎక్కువగా కూరగాయలు వాడటం మంచిదని చాలా మంది చెబుతుంటారు. కానీ టేస్ట్ బాగోదు అనుకుంటూ కేవలం పండ్ల రసాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా మంది. అయితే పండ్ల రసాల కంటే కూడా పచ్చి కూరగాయల రసాలు ఆరోగ్యాన్ని బాగు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయట. రోజువారీ భోజనానికి ప్రత్యామ్నాయంగా అప్పుడప్పుడూ జ్యూసులు తీసుకోవాలని చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందట. విటామిన్ సి పుష్కలంగా ఉన్న కొన్ని కూరగాయలు, పండ్లను వండేటప్పుడు వాటి పోషకాలను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని నేరుగా అంటే పచ్చి కూరగాయల రసాలను తాగడం వల్ల అన్ని పోషకాలకు మన శరీరానికి అందుతాయి. అయితే ముఖ్యంగా సొరకాయ, పొట్లకాయల్లో 92 శాతం నీటితో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి.

Advertisement

దీన్ని తీసుకోవడం వల్ల శరీరాన్ని డీహెడ్రేట్ నుంచి కాపాడుకోవచ్చు. భారతదేశంలో దీన్ని లౌకి లేదా ధూది అని పిలుస్తారు. పొట్లకాయలో నీటితో పాటు విటామిన్ సి, కె, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.పొట్లకాయ, సొరకాయలను పచ్చిగా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల గుండెను కాపాడుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను త్గిగంచడంలో ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. డయాబెటిక్ రోగులకు కూడా ఈ రసం ఎంతగానో ఉపయోగపడుతుందట. చక్కెర స్థాయిలను తగ్గించి రక్తపోటును సమాన స్థాయిలో ఉంచడంలో పొట్లకాయ జ్యస్ ప్రత్యేక పాత్ర వహిస్తుంది.  అయితే ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసుడు పొట్లకాయ లేదా సొరకాయ జ్యూస్ తీసుకోవాలి. ఈ రసం వేగంగా ఆక్సీకరణం చెందుతుంది కాబట్టి ఎటువంటి సమస్యా ఉండదు.

Health Tips of pumpkin juice

Advertisement

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే సొరకాయ కాలేయ మంటను నయం చేస్తుంది.మన కిడ్నీ, లివర్ నుంచి విషాన్ని తొలగిస్తాయి. ప్రీ రాడికల్స్ నుంచి మూత్ర పిండాలు, కాలేయాన్ని రక్షించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అంద వల్ల సొరకాయ, పొట్ల కాయను మన ఆహార పదార్థాల్లో విరివిగా ఉపయోగిస్తూ ఉండాలి. అలాగే వీటి వల్ల మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంట కూడా తగ్గుతుందట. అంతే కాకుండా కాలేయం, మూత్ర పిండాలకు ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుందట. ఇలి ఆల్కలైజింగ్ మరియు మూత్ర విసర్జన ప్రభావాన్ని కల్గి ఉన్నందున ఇది మూత్ర సంబంధ వ్యాధఉల సంక్రమణ అవకాశాలను కూడా తగ్గిస్తుంది. మీరు అధిక క్రియేటిన్ మరియు యూరిక్ యాయిడ్ కల్గి ఉంటే తరచూ పొట్ల కాయ లేదా సొర కాయ జ్యూసులను తీసుకోవడం చాలా మంచిది.

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి