
home made peel off mask for black heads
Beauty Tips : ఈ మధ్య అందరూ అందంపై ఆసక్తి కనబరుస్తున్నారు. మొహంపై ఏ చిన్న మచ్చ వచ్చినా, పింపుల్ వచ్చినా వెంటనే బ్యూటీ పార్లర్, స్కిన్ కేర్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి వీటిని తగ్గించుకోవడం కంటే ఇంట్లో చిన్న చిట్కాతోనే నయం చేసుకోవచ్చు. అయితే అదెలా అనుకుంటున్నారా… చూడండి మీరే. ముందుగా కాస్త పసుపు, పెరుగు, ఒట ఆలుగడ్డ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల పెరుగు వేసుకోవాలి. పెరగులో ఉంటే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. టాన్ రిమూవ్ చేయడంలో పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా బాగా పని చేస్తుంది. చర్మం మృదువుగా కాంతి వంతంగా తయారవతుంది.
తర్వాత దీనిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీని కోసం మామూలు పసుపు లేదా కస్తూరి పలుపు ఏదైనా రే వాడుకోవచ్చు. వంటల్లో వైడే పసుపు మీ చర్మానికి పడదు అనుకుంటే కస్తూపి పసుపు ఉపయోగించుకోవచ్చు. చర్మంపై ఉండే పింపుల్స్ బ్యాక్టీరియాను పోగొట్టడంలో చాలా బాగా ఉపయోగపడతుంది.ఒక పొటాటోను శుభ్రంగా కడిగి తురుముకొని పెట్టుకోవాలి. పొటాటో నుండి రెండు చెంటాల పొటాటో జ్యూస్ తీసుకొని దీనిలో కలుపుకోవాలి. పొటాటో జ్యూస్ బదులుగా క్యారెట్ జ్యూస్ లేదా అలోవెరా జ్యూస్ తేన ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తంగా అప్లై చేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
home made peel off mask for black heads
ఇలా వారానికి మూడు సార్లు లేదా రోజూ కూడా వేసుకోవచ్చు. ఇలా మూడు రోజులు ట్రై చేసే సరికి తేడా గమనించవచ్టు. ఈ చిట్కా రాత్రి ఉపయోగించడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల నల్లటి మచ్చు డార్క్ పాచెస్ మంగు మచ్చలు టాన్ పింపుల్స్ పిగ్మెంటేషన్ తొలగిపోతాయి. పెరుగు మరియు పసుపు పిగ్మెంటేషన్ తగ్గించి చర్మ రంగును మెరుగుపరుస్తుంది. పొటాటో జ్యూస్ కూడా పిగ్మెంటేషన్ తగ్గించడంల అద్బుతంగా పని చేస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు, పింపుల్స్ వల్ల ఏర్పడిని మచ్చలను తగ్గిస్తుంది. ఈ ఈజీ చిట్కాతో ఎప్పటి నుంచో మీ ముఖంపై పేరుకు పోయిన పిగ్మెంటేషన్ పోతుంది. ఈ ప్యాక్ వల్ల ముఖం ప్సాట్ లెస్ గా, కాంతివంతంగా, మృుదువగా తయారవుతుంది. ఈ చిట్కా మీరు కూడా ట్రై చేసి ముఖంపై ఉండే మచ్చలు, టాన్, పిగ్మెంటేషన్ ను తగ్గించుకోండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.