Home Remedies : వర్షాకాలం రానే వచ్చింది. ఈ కాలం వచ్చింది అంటే చాలు ఎన్నో సమస్యలు వచ్చి పడతాయి. ఈ సమస్యలలో ఒకటి పాదాల పగుళ్లు. అయితే ఈ కాలంలో ఉండే చల్లని వాతావరణం మరియు మాయిశ్చరైజింగ్ తగ్గడం, నీటిలో ఎక్కువసేపు ఉండటం, అపరిశుభ్రత లాంటి కారణాల వలన పాదాలు అనేవి ఎక్కువగా పగులుతూ ఉంటాయి. ఇవి చర్మంపై చికాకుని కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, థైరాయిడ్,పొడి చర్మం, చర్మ సమస్యలు ఉన్నవారికి ఈ సమస్యలు అధికంగా కనిపిస్తాయి. అయితే ఈ సమస్యలకు ఇంట్లోనే ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
రాత్రి పడుకునే ఒక గంట ముందు వేడి నీటిలో కొద్దిసేపు పాదాలను నానబెట్టి ఆ పాదాలను నీటిగా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత తడినంత టవల్ తో తుడుచుకొని ఆరబెట్టాలి. తర్వాత అలోవెరా జెల్ ను అప్లై చేసుకుంటే చాలు…
అరెబకెట్ నీటిలో గోరువెచ్చని నీరు పోసుకొని రెండు చెంచాల బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత 15 నుండి 20 నిమిషాల పాటు ఆ నీటిలో పాదాలను నానబెట్టాలి. తర్వాత మెత్తని స్క్రబ్బర్తో క్లీన్ చెయ్యాలి. ఇలా చేసినట్లయితే పాదాలలో ఉన్నటువంటి మృత కణాలు అనేవి తొలగిపోయి రక్త ప్రసరణ అనేది మెరుగుపడుతుంది. దీంతో బ్యాక్టీరియాల్స్, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే పాదాలు కూడా మెరుస్తాయి. ఇలా వారానికి రెండు లేక మూడు రోజులు ఇలా చేస్తే చాలు. మీ పాదాల ఎంతో మృదువుగా ఉంటాయి…
పడుకునే ముందు పాదాలను బాగా కడగాలి. తర్వాత తడి ఆరిపోయేలా తుడుచుకోవాలి. అలాగే పొడి చర్మం తేమగా ఉండడానికి చనిపోయినటువంటి చర్మకణ జాలాన్ని తగ్గించేందుకు పగుళ్లు ఉన్నటువంటి ప్రదేశంలో కొబ్బరి నూనెను రాసుకోండి. ఇది చర్మం లోకి లోతుగా చోచ్చుకొని పోయి పోషణను ఇస్తుంది. ఇది గాయాలను నయం చేయటంలో కూడా హెల్ప్ చేస్తుంది…
తేనె : తేనెల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిలోని యాంటీ మైక్రోబియన్ గుణాలు పాదాల పగుళ్ల మధ్య ఏర్పడినటువంటి క్రిములను కూడా నాశనం చేయగలదు. దీనికోసం అర బకెట్ నీళ్లలో అర కప్పు తేనె వేసుకొని బాగా కలపండి. తర్వాత పాదాలను 15 నుండి 20 నిమిషాల పాటు ఆ బకెట్లో నానబెట్టాలి. ఆ తర్వాత స్క్రబ్బర్ తో క్లీన్ చేయాలి. ఇలా చేయటం వలన పాదాల పగుళ్లు అనేవి తగ్గుతాయి…
అరటిపండు : అరటిపండు కూడా పాదాల పగుళ్లను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని ఎంతో మృదువుగా చేస్తాయి. అలాగే పగిలినటువంటి పాదాలపై అరటి తొక్కతో రుద్దుకోవాలి. ఇలా అరటి తొక్కతో 15 నుండి 20 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవచ్చు. తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి.
వెజిటేబుల్ ఆయిల్ : నిజం చెప్పాలంటే, నూనెను రాయటం వలన పాదాల పగుళ్లు అనేవి తగ్గుతాయి. దీనికోసం వెజిటేబుల్ ఆయిల్ కూడా రాసుకోవచ్చు. ముందుగా పాదాలను క్లీన్ చేసుకోవాలి. తర్వాత తడిని శుభ్రంగా తుడుచుకొని వెజిటేబుల్ ఆయిల్ ను రాసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు అనగా ఒక గంట ముందు ఆయిల్ తో మసాజ్ చేసుకోండి. ఇలా ప్రతిరోజు గనక చేసినట్లయితే కాళ్ళ పగుళ్లు అనేవి తగ్గుముఖం పడతాయి…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.