Home Remedies : వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు… బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Home Remedies : వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు… బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే…!

 Authored By ramu | The Telugu News | Updated on :13 August 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Home Remedies : వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు... బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే...!

Home Remedies : వర్షాకాలం రానే వచ్చింది. ఈ కాలం వచ్చింది అంటే చాలు ఎన్నో సమస్యలు వచ్చి పడతాయి. ఈ సమస్యలలో ఒకటి పాదాల పగుళ్లు. అయితే ఈ కాలంలో ఉండే చల్లని వాతావరణం మరియు మాయిశ్చరైజింగ్ తగ్గడం, నీటిలో ఎక్కువసేపు ఉండటం, అపరిశుభ్రత లాంటి కారణాల వలన పాదాలు అనేవి ఎక్కువగా పగులుతూ ఉంటాయి. ఇవి చర్మంపై చికాకుని కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, థైరాయిడ్,పొడి చర్మం, చర్మ సమస్యలు ఉన్నవారికి ఈ సమస్యలు అధికంగా కనిపిస్తాయి. అయితే ఈ సమస్యలకు ఇంట్లోనే ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Home Remedies అలోవెరా జెల్

రాత్రి పడుకునే ఒక గంట ముందు వేడి నీటిలో కొద్దిసేపు పాదాలను నానబెట్టి ఆ పాదాలను నీటిగా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత తడినంత టవల్ తో తుడుచుకొని ఆరబెట్టాలి. తర్వాత అలోవెరా జెల్ ను అప్లై చేసుకుంటే చాలు…

Home Remedies : వంట సోడా

అరెబకెట్ నీటిలో గోరువెచ్చని నీరు పోసుకొని రెండు చెంచాల బేకింగ్ సోడా వేసుకోవాలి. తర్వాత 15 నుండి 20 నిమిషాల పాటు ఆ నీటిలో పాదాలను నానబెట్టాలి. తర్వాత మెత్తని స్క్రబ్బర్తో క్లీన్ చెయ్యాలి. ఇలా చేసినట్లయితే పాదాలలో ఉన్నటువంటి మృత కణాలు అనేవి తొలగిపోయి రక్త ప్రసరణ అనేది మెరుగుపడుతుంది. దీంతో బ్యాక్టీరియాల్స్, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే పాదాలు కూడా మెరుస్తాయి. ఇలా వారానికి రెండు లేక మూడు రోజులు ఇలా చేస్తే చాలు. మీ పాదాల ఎంతో మృదువుగా ఉంటాయి…

Home Remedies : కొబ్బరి నూనె : మీరు ఎప్పుడు

పడుకునే ముందు పాదాలను బాగా కడగాలి. తర్వాత తడి ఆరిపోయేలా తుడుచుకోవాలి. అలాగే పొడి చర్మం తేమగా ఉండడానికి చనిపోయినటువంటి చర్మకణ జాలాన్ని తగ్గించేందుకు పగుళ్లు ఉన్నటువంటి ప్రదేశంలో కొబ్బరి నూనెను రాసుకోండి. ఇది చర్మం లోకి లోతుగా చోచ్చుకొని పోయి పోషణను ఇస్తుంది. ఇది గాయాలను నయం చేయటంలో కూడా హెల్ప్ చేస్తుంది…

తేనె : తేనెల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిలోని యాంటీ మైక్రోబియన్ గుణాలు పాదాల పగుళ్ల మధ్య ఏర్పడినటువంటి క్రిములను కూడా నాశనం చేయగలదు. దీనికోసం అర బకెట్ నీళ్లలో అర కప్పు తేనె వేసుకొని బాగా కలపండి. తర్వాత పాదాలను 15 నుండి 20 నిమిషాల పాటు ఆ బకెట్లో నానబెట్టాలి. ఆ తర్వాత స్క్రబ్బర్ తో క్లీన్ చేయాలి. ఇలా చేయటం వలన పాదాల పగుళ్లు అనేవి తగ్గుతాయి…

అరటిపండు : అరటిపండు కూడా పాదాల పగుళ్లను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని ఎంతో మృదువుగా చేస్తాయి. అలాగే పగిలినటువంటి పాదాలపై అరటి తొక్కతో రుద్దుకోవాలి. ఇలా అరటి తొక్కతో 15 నుండి 20 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవచ్చు. తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి.

Home Remedies వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే

Home Remedies : వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు… బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే…!

వెజిటేబుల్ ఆయిల్ : నిజం చెప్పాలంటే, నూనెను రాయటం వలన పాదాల పగుళ్లు అనేవి తగ్గుతాయి. దీనికోసం వెజిటేబుల్ ఆయిల్ కూడా రాసుకోవచ్చు. ముందుగా పాదాలను క్లీన్ చేసుకోవాలి. తర్వాత తడిని శుభ్రంగా తుడుచుకొని వెజిటేబుల్ ఆయిల్ ను రాసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు అనగా ఒక గంట ముందు ఆయిల్ తో మసాజ్ చేసుకోండి. ఇలా ప్రతిరోజు గనక చేసినట్లయితే కాళ్ళ పగుళ్లు అనేవి తగ్గుముఖం పడతాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది