Home » Health » How Many Benefits There Are If You Keep Silent
Health

Silent : మౌనానికి ఉన్న శక్తి ఏమిటో తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: December 5, 2024, 9:00 am
Advertisement

Silent : చాలామంది చిన్న విషయానికి కూడా చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. అయితే మనం గట్టిగా అరవడం వలన మన శరీరంతో పాటుగా మనసు మరియు మెదడును కూడా ప్రభావితం చేస్తుంది అని అంటున్నారు నిపుణులు. దీనివలన మానసిక ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది అని అంటున్నారు. అయితే మన మానసిక ఆరోగ్యానికి మౌనం అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు నిపుణులు. అలాగే మనం మౌనంగా ఉండడం వలన మెదడు ఆరోగ్య అనేది కూడా ఎంతో మెరుగవుతుంది .అలాగే మెదడుకు సంబంధించిన సమస్యలు అనేవి మన దరిచేరకుండా ఉంటాయి. అంతేకాక మీ మౌనంతో జ్ఞాపకశక్తిని కూడా పెంచుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే మనం రోజులో ఒక గంట పాటు మౌనంగా ఉండడం వలన మీరు క్రియేటివిటీ ని కూడా పెంచుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. మీరు మౌనంగా ఉండడం వలన ఒత్తిడి అనేది తగ్గి ఎంతో ప్రశాంతంగా ఉంటారు. దీని వలన నిద్రలేమి సమస్యల నుండి ఈజీగా బయటపడొచ్చు అని అంటున్నారు. దీని ఫలితంగా మీరు సుఖంగా మరియు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతారు…

Advertisement

Silent : మౌనానికి ఉన్న శక్తి ఏమిటో తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!!

మీరు మౌనంగా ఉండడం వలన కమ్యూనికేషన్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెంచుకోవచ్చు అని అంటున్నారు. అలాగే ప్రశాంతంగా ఉండేందుకు మౌనం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే మీరు రోజులో కొద్దిసేపు అయినా సైలెంట్ గా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఒత్తిడి అనేది మీ దరి చేరదు. అలాగే గుండె సమస్యలు కూడా రావు అని అంటున్నారు. అంతేకాక మౌనం వలన మన శరీరంలో రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది అని అంటున్నారు. మీ కోపం అదుపులో ఉండాలంటే మౌనం చాలా బాగా పనిచేస్తుంది. రోజులో కొద్దిసేపు సైలెంట్ గా ఉంటే కోపం అనేది తగ్గుతుంది అని అంటున్నారు మానసిక నిపుణులు. మౌనంగా ఉంటే ప్రశాంతత అనేది మనకు లభిస్తుంది. దీంతో మీరు మంచి నిర్ణయాలను తీసుకుంటారు…

Advertisement

మౌనంగా ఉండడం వలన మిమ్మల్ని మీరు చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు వలన మీరు ముందుకు వెళ్ళలేరు. కానీ మౌనంగా ఉంటే మాత్రం మీరు అనుకున్నది కచ్చితంగా సాధించగలరు అని అంటున్నారు. అయితే మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీని ఫలితంగా మనం ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడపగలం. కావున మౌనానికి ఉన్న శక్తిని మీరు అర్థం చేసుకోవాలి అని అంటున్నారు. అందుకే రోజులో ఒక గంట సేపైనా మౌనంగా ఉండి మనం మన మనసును మరియు శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి అని అంటున్నారు మానసిక నిపుణులు

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి