
vitamin D : విటమిన్ డి లోపం వల్ల శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి... దీనిని ఎలా గుర్తించాలి...!
vitamin D : మన శరీరంలో ఏదైనా విటమిన్ లోపం వలన ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం విటమిన్ డి లోపం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయ్యింది. దీని లోపం వలన రోగనిరోధక వ్యవస్థపై కూడా ఎంతో ప్రభావం పడటంతో పాటు ఎముకల బలహీనతకు కూడా దారి తీస్తుంది. అయితే విటమిన్ డి శరీరంలో బోలు ఎముకల వ్యాధి,రికెట్స్ లాంటి సమస్యల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అయితే శరీరంలో విటమిన్ డి అవసరమైన మొత్తాల్లో లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విటమిన్ డి జలుబు మరియు దగ్గు మరియు ఫ్లూ లాంటి సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. ఇక కండరాల బలాన్ని కూడా ఎత్తగానే పెంచేందుకు పని చేస్తుంది. సూర్యుని కిరణాల నుండి మన శరీరం డి విటమిన్ తీసుకుంటుంది. అయితే ఆహారం గురించి చెప్పాలి అంటే. ట్యూనా ఫిష్, గుడ్డు పచ్చ సోనా, పుట్టగొడుగులలో కూడా విటమిన్ డి అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కానీ సూర్యరశ్మీ లో ఉండకపోవడం వలన ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరంలో విటమిన్ డి లోపం వచ్చే అవకాశం ఉంది. దీని లోపం వలన వచ్చే లక్షణాలు శరీరంలో కూడా కనిపించటం మొదలవుతుంది. కానీ ప్రజలు దాని గురించి పెద్దగా తెలుసుకోలేకపోతారు. ఇలాంటి పరిస్థితులలో విటమిన్ డి లోపం గుర్తించటం చాలా అవసరం. అయితే ఈ విటమిన్ డి లోపం ఎలా గుర్తించాలో తెలుసుకుందాం…
విటమిన్ డి లోపం వలన శరీరంలో అలసట అనేది ఏర్పడుతుంది అని ఢిల్లీలోని జిటిబి హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అంకిత్ కుమార్ తెలిపారు. దీని లోపం వలన ఒకసారిగా శక్తి స్థాయి అనేది పడిపోవడం మొదలవుతుంది. అంతేకాక ఎముకల నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది.ఈ సమస్య అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ విటమిన్ డి లోపం మీ మెదడు ఆరోగ్యాన్ని కూడా ఎంతో ప్రభావితం చేయగలదు. ఇది మానసిక కల్లోలం, విచారం, నీరసం, ఆందోళన లాంటి సమస్యలను కూడా కలిగించగలదు. ఈ విటమిన్ డి అనేది న్యూరో ట్రాన్సిట్లర్ల కు సంబంధించింది. ఇది మెదడులోని భావోద్వేగాలను తగ్గించేందుకు కూడా ఈ న్యూరో ట్రాన్స్ మీటర్లు అనేవి బాగా పనిచేస్తాయి. అలాగే విటమిన్ డి అవసరమైనంత లేనప్పుడు న్యూరో ట్రాన్స్ మీటర్లు పనితీరు కూడా దెబ్బతింటుంది. ఇది మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలను కూడా కలిగించగలదు. అంతేకాక ఎక్కువసేపు విచారంగా ఉండటం వలన కూడా తలనొప్పి డిప్రెషన్ సమస్యలు వస్తాయి…
vitamin D : విటమిన్ డి లోపం వల్ల శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి… దీనిని ఎలా గుర్తించాలి…!
ఈ ప్రమాదాలను ఎలా నివారించాలి : ప్రతినిత్యం 15 నుండి 20 నిమిషాల పాటు ఎండలో ఉండండి. అలాగే చేపలు,గుడ్డు పచ్చసోనా, పుట్టగొడుగు లాంటివి తీసుకోవాలి. అంతేకాక పాలు మరియు పాల ఉత్పత్తులను కూడా అధికంగా తీసుకోవాలి. మీ వైద్యుడు సూచించిన విధంగా విటమిన్ డి సప్లిమెంట్లను కూడా తీసుకోవటం మంచిది. అలాగే మీరు ముందుగా విటమిన్ డి గురించి తెలుసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోవటం చాలా మంచిది. దీని వలన దాని లోపాన్ని తొందరగా గుర్తించవచ్చు…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.