Mahesh Babu : డ్యుయల్ రోల్ లో మహేష్.. బాక్సాఫీస్ ని చేసేందుకు డబుల్ ధమాకా ప్లాన్ చేసిన జక్కన్న..!
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇద్దరు కలిసి కొన్నళ్లుగా సినిమా చేయాలని అనుకుంటున్నారు కానీ అది ఇన్నాళ్లకు కుదిరింది. గుంటూరు కారం తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి అడిగిన రోజులు డేట్స్ ఇచ్చేందుకు మహేష్ సిద్ధమయ్యాడు. రాజమౌళితో సినిమా అంటే తక్కువలో తక్కువ 3 ఏళ్లు అయినా ఇవ్వాల్సిందే. మహేష్ రాజమౌళి సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా వస్తుందని అంటున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు జక్కన్న. అందుకే సినిమా కోసం అక్కడ టెక్నిషియన్స్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక సినిమా బడ్జెట్ కూడా 1000 కోట్ల దాకా పెడుతున్నారన్న వార్త ఐతే హల్ చల్ చేస్తుంది.
ఇక ఈ సినిమా నుంచి ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. సినిమాలో మహేష్ ఒక్కడు కాదు ఇద్దరట. అంటే సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ పూర్తి స్థాయిలో మేకోవర్ ఉంటుందని టాక్. ఇప్పటికే సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ గడ్డం పెంచుకుంటున్నాడు. మహేష్ ని ఇదివరకు ఎప్పుడూ చూడని కొత్త లుక్ లో రాజమౌళి చూపించనున్నాడని తెలుస్తుంది.
Mahesh Babu : డ్యుయల్ రోల్ లో మహేష్.. బాక్సాఫీస్ ని చేసేందుకు డబుల్ ధమాకా ప్లాన్ చేసిన జక్కన్న..!
మహేష్ రాజమౌళి సినిమాలో మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమార్ కూడా నటిస్తాడని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా లో కాస్టింగ్ కూడా భారీగా ఉండబోతుందని టాక్. త్వరలోనే మహేష్ కు సంబందించిన ఒక షో రీల్ అయితే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఇక సినిమా కోసం కొంత వర్క్ షాప్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. మరి ఎస్.ఎస్.ఎం.బి 29 నెవర్ బిఫోర్ అనిపించే రికార్డులు కొల్లగొట్టేలా రాజమౌళి ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండియ యాక్టర్ ని తీసుకుంటారా లేదా హాలీవుడ్ భామని ఎవరినైనా తీసుకుంటారా అన్నది చూడాలి.
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
This website uses cookies.