
Diabetic Patients : డయాబెటిస్ రోగుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే... వెంటనే వైద్యులను సంప్రదించండి...!
Diabetic Patients : ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ తో బాధపడుతున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకి ఎంతగానో పెరుగుతుంది. అయితే సైలెంట్ కిల్లర్ లా ఇది ఎంతో మంది ప్రాణాలను హరిస్తుంది. అయితే ప్రస్తుతం ఎంతో మంది టైప్ టు డయాబెటిస్ తో ఇబ్బంది పడుతున్నారు. అలాగే అనారోగ్య జీవనశైలి దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అంతేకాక మితిమీరిన ఒత్తిడి మరియు నిద్రలేమి, బయట ఆహారానికి అలవాటు పడడం,మద్యం సేవించడం, దోమపానం లాంటి చెడు అలవాట్ల వలన రక్తంలో చక్కెర స్థాయి అనేది ఎంతగానో పెరుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి అనేది పెరిగినప్పుడు దాని లక్షణాలు కొన్ని శరీరంలో కూడా కనిపిస్తాయి. అయితే నిత్యం వణుకు మరియు ఆకలి మందగించటం, మూత్ర విసర్జన చేయడం,అకస్మాత్తుగా బరువు తగ్గటం, కాళ్ల నొప్పులు లాంటి లక్షణాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి.
అంతేకాక రక్తంలో చక్కెర స్థాయి అనేది పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు కూడా చర్మంపై మనకు కనిపిస్తాయి. అయితే డయాబెటిస్ రోగులకు చర్మ సమస్యలు అనేవి చాలా తక్కువగా వస్తాయి. కానీ చక్కెర స్థాయిలు అనేవి పెరిగినట్లయితే చర్మంపై కొన్ని సంకేతాలు కూడా మనకు కనిపిస్తాయి. రక్తంలో చక్కర స్థాయి అనేది పెరిగినప్పుడు చర్మం పై డార్క్ ప్యాచ్ లు మనకు కనిపిస్తూ ఉంటాయి. దీంతో మెడ, చంకలు, నడుపు, మోచేతులు లాంటి ప్రదేశాలలో నల్లటి మచ్చలు అనేవి వస్తాయి. అంతేకాక కొన్ని సందర్భాలలో హార్మోన్ల అసమతుల్యత కూడా ఇలాంటి మచ్చలకు కారణం అవుతుంది. అంతేకాక చర్మంపై ఎరుపు లేక గోధుమ రంగు గుండ్ర ని మచ్చలు మరియు గీతలు కూడా కనిపిస్తాయి. దీనిని డయాబెటిక్ డెర్మటోపతి అని అంటారు.
Diabetic Patients : డయాబెటిస్ రోగుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే… వెంటనే వైద్యులను సంప్రదించండి…!
సాధారణంగా ఈ రకమైనటువంటి మచ్చలు అనేవి పాదాల ముందు భాగం లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇది అనేది అంతగా బాధాకరం అనిపించక పోయినా వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోవటం మంచిది. అలాగే పొడి చర్మం మధుమేహ లక్షణాలలో ఒకటి అని చెప్పొచ్చు. దీనివల్ల చర్మం పై దద్దుర్లు మరియు దురద లాంటి సమస్యలు పెరుగుతాయి . ఇటువంటి చర్మ సమస్యలను మీరు తేలికగా తీసుకోకండి. అయితే డయాబెటిస్ ఉన్నటువంటి వారు ఏవైనా చర్మ సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించటం మరవద్దు. అలాగే రక్తంలో చక్కెర స్థాయి ఎంత పెరిగిందో నిత్యం చెక్ చేసుకుంటూ ఉండాలి…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.