Cancer : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే అది క్యాన్సర్ అవ్వచ్చు.. తస్మాత్ జాగ్రత్త..!!
Cancer : ప్రస్తుతం ప్రపంచంలో చాలామంది భయభ్రాంతులతో గురవుతున్న వ్యాధి క్యాన్సర్. ఇది చాప కింది నీరుల పాకుతుంది. ఈ వ్యాధి పెద్ద సంఖ్యలో ప్రజలను చుట్టుముడుతోంది. ఈ వ్యాధికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆరోగ్య నిపుణులు. జన్యుపరమైన అంశాలు, ఆహారపు అలవాట్లు వంశపారపర్యం అని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఏ క్యాన్సర్ అయిన తొలి దశలో వచ్చే లక్షణాల్ని బట్టి తెలుసుకోవాలి. లేదంటే అది ప్రమాదకరంగా మారుతుంది. ఆలస్యంగా లక్షణాలు బయటపడతాయి,: సహజంగా క్యాన్సర్ అనేది అతిపెద్ద వ్యాధి ఎందుకంటే ఇది ఆలస్యంగా నిర్ధారణ అవుతుంది. మెజారిటీ కేసులలో ఇది చివరి దశలకు చేరుకునే వరకు లక్షణాలు స్పష్టంగా కనపడవు.
ఎవరికైనా దగ్గు, నొప్పి రక్తస్రావం మొదలైన అసాధారణ లక్షణాలు కనిపించినప్పుడు లేదా ఇతరులు గమనించినట్లుగా శరీర అలవాట్లు లేదా అకస్మాత్తుగా బరువు పెరగడం తగ్గడం లాంటివి గమనించినప్పుడు తప్పనిసరిగా వైద్యం ని సంప్రదించాలి. కారణం లేకపోయినా : కొన్ని క్యాన్సర్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. క్యాన్సర్ను మొదటగా గుర్తించడం స్క్రీనింగ్ చేయడం చాలా ప్రధానమని చెప్తున్నారు. చాలామంది వంశపారపర్యంగా క్యాన్సర్ రావచ్చు. ఇంకొంతమందికి ధూమపానం ,లేదా అధిక మధ్యపానం లాంటి కారణాలవల్ల క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది జన్యుపరమైన పర్యావరణ కారకాల కలయిక వల్ల అభివృద్ధి చెందే సంక్లిష్ట వ్యాధి.
అయితే ఒక వ్యక్తి జీవనశైలి ఆహారం వ్యాయామం కుటుంబ చరిత్ర మొదలైన వాటి ద్వారా సూక్ష్మ ప్రధానం ప్రమాద కారకాలను గుర్తించుకోవచ్చు. మనదేశంలో సాధారణ క్యాన్సర్లు ఇవే.. అధ్యాయనం ప్రకారం మెడ, తల, ఊపిరితిత్తుల క్యాన్సర్లు మగవారిలో సర్వసాధారణంగా అయితే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ మహిళల్లో సర్వసాధారణమైపోయింది. అలాగే పెద్ద పేగు క్యాన్సర్ లు కూడా ఇటీవల లో బాగా ఎక్కువ అవుతున్నాయి మనదేశంలో అత్యంత సాధారణ క్యాన్సిల్ క్యాన్సర్ గా ఆ తర్వాత పెద్ద పేగు క్యాన్సర్ లాంటివి అధికంగా వస్తున్నాయి. అందుబాటులో చికిత్సలు : ఇటేవలి కాలంలో క్యాన్సర్ కు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ రకాన్ని బట్టి వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త మందులు తెరపి ఇలాంటివి అందుబాటులో ఉన్నాయి. అది క్యాన్సర్ రకం అది ప్రస్తుతం ఉన్న దశ రోగుల ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఇలా గుర్తించవచ్చు; క్యాన్సర్ మొదటిదశలో గుర్తిస్తే సరైన చికిత్స చేసేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కొన్ని లక్షణాలు వారిని వివరించారు. వాటిలో ఈ అలసట, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆహార అలవాటులో మార్పులు, గొంతు సమస్యలు, దీర్ఘకాలంగా ఉండే దగ్గు నయం చేయలేని పుండ్లు, మహిళల్లో అసాధారణ పీరియడ్స్ పెల్విక్ నొప్పి, తరచూ జ్వరాలు మొటిమలు తదితర లక్షణాలు గుర్తించవచ్చు.. అన్ని క్యాన్సర్లను తగ్గించవచ్చా : కొన్ని క్యాన్సర్ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అలాగే క్యాన్సర్ను మొదటగా గుర్తించడం స్క్రీనింగ్ చేయడం చాలా ప్రధానమని చెప్తున్నారు. చాలామంది వంశపారేపర్యంగా క్యాన్సర్ రావచ్చు. కొంతమందికి ధూమపానం లేదా మద్యపానం వలన క్యాన్సర్ వస్తుంది. వెయిటింగ్ మొదట్లోనే గుర్తిస్తే వీటికి మంచి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి ట్రీట్మెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స చేస్తారు.