Hair Tips : ప్రత్యేకంగా కొన్ని పోషకాలను తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా అందంగా మెరిసిపోతూ ఉంటుంది. జుట్టుని మనం అలా వదిలేస్తే మనల్ని కూడా జుట్టు వదిలేస్తుంది. కాబట్టి కచ్చితంగా మన శిరోజాలు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే.. అసలు మన తినే ఆహారంలో ఏ ఏ పోషకాలు ఉంటున్నాయి.. ఏవేవి జుట్టుకు అవసరమో పరిశీలించుకోవాలి. మనం అవన్నీ తెలుసుకోబోతున్నాం. మరి పూర్తిగా తెలుసుకుందాం. జుట్టు, ఒత్తుగా, పొడవుగా అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ విషయంలో మహిళలు చాలా సున్నితంగా ఉంటారు. వారు మెరసే జుట్టుతో పాటు పొడువాటి జుట్టుని కోరుకుంటారు. నిజమే కదా జుట్టు వాలు జడ లాగా ఉండాలని ఎవరు కోరుకోరు ప్రతి అమ్మాయి కల కావాలి అనేది వాస్తవానికి సరైన సమాచారం లేకపోవడం
వల్ల జుట్టు పెరగడానికి చర్యలు అవలంబించడం వల్ల ప్రయోజనాల కంటే జుట్టు రాలడమే జరుగుతుంది. ఈ పరిస్థితిలో మరి ఎక్కువవుతుంది. కరోనా వచ్చి పోయింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీద ఆ కరోనా ప్రభావం ఎలా ఉందో జుట్టు మీద కూడా అలాగే ఉంది. అవును జుట్టు ఆరోగ్యంగా ఉంటే మనిషి కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే తినే ఆహారాన్ని బట్టి కూడా మన జుట్టు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మరి జుట్టు బాగా పెరగాలి.. అంటే ఏమి తినాలి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పాలు , కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అందులో మొదటి చెప్పుకునేది పాలకూర ఇవి మాత్రం రెగ్యులర్గా మన ఆహారంలో ఉంటే కచ్చితంగా మన జుట్టూ పెరుగుతూనే ఉంటుంది. ఇక ఆగమన్నా కూడా ఆగదు. అలాగే డ్రై ఫ్రూట్స్ విషయానికొస్తే జీడిపప్పును రెగ్యులర్గా తీసుకోవాలి.
చిలకడదుంపలు అంటే చాలు ఎంత ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మన జుట్టు నల్లగా మెరిసిపోతూ ఉంటుంది. స్త్రీ అయినా పురుషుడైన సరే మద్యం జోలికి అసలు వెళ్ళకూడదు. తీపి పదార్థాలు తగ్గించాలి. అంటే స్వీట్స్ తగ్గిస్తే జుట్టు ఊడకుండా ఉంటుంది. శ్రద్ధ తీసుకొని మన జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. అసలు ఏం చేయాలి. నూనెతో తలని క్రమం తప్పకుండా మా సార్ చేసుకోవాలి. మనకి మనం చేసుకుంటే మనకు ఎవరైనా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి. నిద్ర ఎనిమిది గంటల నిద్రపోతే మనిషికి అప్పుడప్పుడు వస్తున్న ప్రతి ఆరోగ్య సమస్య పోతుంది. తల స్నానం చేసేటప్పుడు అవసరానికి మించి ఎక్కువ షాంపూ వాడకూడదు.
దీని వల్లే మనకి చుండ్రు సమస్య వస్తుంది. దీనికోసం ఒక చిట్కా కొబ్బరి నూనె తీసుకొని దాన్ని ఒక కళాయిలో పోసుకోండి. చక్కగా వంటరెక్క మందరపు ఆకులు, పూలు, ఒక స్పూను మెంతులు, వీలైతే గుంటగరగరాకు అని దొరుకుతుంది. అది కూడా వేసి బాగా మరిగించండి. ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు తర్వాత దానిని స్టవ్ పై నుంచి దింపు వడకట్టుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు జుట్టుకి కుదురు నుంచి చివర్లో వరకు అప్లై చేస్తే మీ జుట్టు పెరగడాన్ని ఎవ్వరు ఆపలేరు. అలాగే పైన మనం చెప్పుకున్నటువంటి ఆహార పదార్థాన్ని కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఈ చిట్కాను గనుక పాటిస్తే తప్పకుండా వాలు జడ మీ సొంతం..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.