Heart Attack : ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తే... మీ గుండె ప్రమాదంలో పడుతున్నట్లే...?
Heart Attack : శరీరంలో కొన్ని వ్యాధులు కొన్ని సంకేతాలను తెలియజేస్తాయి. అయితే గుండె జబ్బులు మాత్రం శరీరానికి నిశ్శబ్దంగా హాని చేస్తాయి. కొన్నిసార్లు శరీరం దాని ప్రారంభ సంకేతాలను తెలియజేస్తుంది. చాలామంది దీనిగురించి శ్రద్ధ పెట్టరు. వైద్యులు గుండె ప్రమాదం ముఖంలో కూడా స్పష్టంగా కన బరుస్తుంది అని తెలియజేస్తున్నారు. మరి దీని సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. శరీరంలో అతి ముఖ్యమైన గుండె. రక్తం సరిగ్గా సరఫరా అయితేనే మనం సజీవంగా ఉంటాం. కానీ గుండె అనారోగ్యానికి గురికావడం ప్రారంభమైతే అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.గుండెలో ఏదైనా సమస్య ఉన్నవారు శరీరంలో అనేక రకాల సంకేతాలను సూచిస్తుంది. ముఖ్యంగా గుండె ప్రమాదంలో ఉంది అనే సంగీతం ముఖంపై స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. తరచూ ప్రజలు ఈ సంకేతాలను విస్మరిస్తూ వస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. లక్షణాలు కనుక మీ ముఖంపై కనిపించినట్లయితే మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లు సంకేతం కావచ్చు.నిపుణులు ఈ లక్షణాల గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. గుండె ప్రమాదంలో ఉంది అనే హెచ్చరిక మొదట ముఖంలో కనిపిస్తుంది. ముఖం పాలిపోవడం, వాపు, చలి చమట వంటి కొన్ని మార్పులు కనిపిస్తాయి.అది గుండె సమస్యకు సంకేతం కావచ్చు.ఈ విషయాల గురించి నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం…
Heart Attack : ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తే… మీ గుండె ప్రమాదంలో పడుతున్నట్లే…?
మీ ముఖం రంగు పాలిపోయినట్లు లేదా నీలం రంగులోకి మారినట్లయితే చాలా జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. అస్సలు సాధారణం సమస్య కాదు. చాలా ప్రమాదకరమైన సంకేతం. ఆక్సిజన్ లేకపోవడం వల్ల చర్మం ప్రధానంగా పెదవులు కళ్ళ చుట్టూ ఉన్న చర్మం పారిపోయినట్లుగా లేదా నీలం రంగులోకి మారితే అది ప్రమాదకరం గా అవుతుంది. వైద్య పరిభాషలో దీనిని సైనోసిస్ అంటారు.ఇది చాలా తీవ్రమైన సంకేతం ఇలాంటి సందర్భంలో మీరు వెంటనే వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు సలహా, సూచనలు పాటించాల్సి ఉంటుంది.
వాతావరణంతో ఎలాంటి సంబంధం లేకుండా మీ ముఖం మీద చల్లని చెమటలు కనిపించినా, అది గుండె జబ్బులకు సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు. శరీరంలో ఆక్సిజన్ లేకపోవడం గుండెపోటుకు ముందు ఒత్తిడికి కారణం కావచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది.మీ ముఖం మీద చల్లని చెమటలు వేయడం కనిపిస్తే అది ఒక హెచ్చరికగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది.
ముఖం మీద వాపు : ఎటువంటి కారణం లేకుండా ముఖం అకస్మాత్తుగా వాపు వచ్చినట్లయితే జాగ్రత్తగా ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు. ఒక మీద ప్రధానంగా బుగ్గలపై లేదా కళ్ళకింద అకస్మాత్తుగా వాపు రావడం రక్త ప్రసన్నలు సమస్య వల్ల కావచ్చు. గుండెకు రక్తాన్ని సరిగ్గా పంపు చేయలేకపోవడం వలన ఇలా జరుగుతుంది. దాని ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. వాపు ఇదే కారణం కాబట్టి ఇది జరిగితే నిర్లక్ష్యము వహించవద్దు.
అలసిపోయినట్లు కనిపించడం : ముఖంపై అలసిపోయినట్లు లేదా వదులుగా కనిపించిన లేదా మొత్తం బలహీనంగా ఉంటే అది కూడా గుండె జబ్బులకు సంకేతం కావచ్చు. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోతే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
దవడ లేదా గడ్డం భాగంలో పదునైన నొప్పి : గుండెపోటు సమయంలో చాతినొప్పి మాత్రమే ఉంటుందని చాలామందికి తెలుసు.కానీ ఇది నిజం కాదు గుండెపోటు సమయంలో దవడ, మెడ, గడ్డం, చెవులలో కూడా నొప్పి ఉంటుంది. ముఖ్యంగా, ఈ నొప్పి అకస్మాత్తుగా సంభవించి ఏదైనా శారీరక శ్రమ తర్వాత పెరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
Brahmotsavams : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఏదులాబాద్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ గోదాదేవి సమేత రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు అత్యంత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, రాజకీయ వేధింపులను నమోదు చేసేందుకు వైసీపీ ప్రత్యేక యాప్‌ను…
RK Roja : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని…
Flipkart Freedom Sale : ఆగస్టు 2 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ Flipkart ఫ్రీడమ్ సేల్‌లో వినియోగదారులకు ఊహించని డీల్స్…
Kuppam Pulivendula : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర…
Nagarjuna Sagar : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ భారీ వరద నీటితో నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువ…
Hyderabad Sperm Scam : సికింద్రాబాద్‌లో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరిట చోటుచేసుకున్న శిశు వ్యాపార దందా…
Kalpika Ganesh : హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ -కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్టులో కల్పిక నానా హంగామా…
This website uses cookies.