Home » Exclusive » Incredible Health Benefits Of Onion Shell
Exclusive

Health Tips : ఉల్లిపాయలే కాదు వాటి పొట్టుతో కూడా చాలా లాభాలున్నాయి.. తెలుసా?

Authored By
pavan J
The Telugu News | Published on: March 10, 2022, 5:30 pm
Advertisement

Health Tips : ఉల్లిపాయ ప్రతీ ఇంట్లో ఉంటాయి. ప్రతి రోజూ కూరలో దీన్ని తప్పని సరిగా వాడుతుంటారు చాలా మంది. అయితే మనం ఉల్లి గడ్డను వంటల్లో వాడేముందు దానిని మంచిగా కడిగి.. శుభ్రంగా పొట్టు తీసి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని వాడుతుంటాం. అయితే మనం వద్దు చెత్తని భావిస్తూ పడేసే ఉల్లిపాయ పొట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. అంతే కాదు ఉల్లిపాయ కంటే కూడా ఉల్లిపాయ పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయట. ఈ విషయం తెలిసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. అలాగే ఎంత పోషకాలు ఉన్నప్పటికీ ఉల్లిగడ్డ పొట్టు తినడం ఏంటని అనుకుంటున్నారా… నేరుగా ఉల్లిపాయ పొట్టును తినాల్సిన అవసరం ఏం లేదండి. మనం చేసే వంటలు ముఖ్యంగా సూప్, కూరగాయలు ఉడుకుతున్నప్పుడు ఉల్లిపాయ తొక్కలను అందులో వేయాలి.

Advertisement

ఇది సూప్ ను, కూరలను గట్టి పడేలా చేస్తుంది. అంతే కాకుండా వంటలకు మంచి రంగు వచ్చేలా చేస్తూనే.. మరింత రుచి వచ్చేలా చేస్తుంది. అయితే ఉడకబెట్టేటపుడు వేసిన ఈ పొట్టును కీరం దింపేసే ముందు తీసేయాల్సి ఉంటుంది.అయితే ఉల్లిపాయ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటామిన్ ఎ, సీ, ఇ మరియు గుండె ఆరోగ్యానికి అనుకూలమైన ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఉల్లిపాయ పొట్టును తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో ఉండే రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఉల్లిగడ్డ పొట్టు ఎంతగానో దోహద పడుతుంది. మీ ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా ఉల్లిపాయ పొట్టును తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయ తొక్కలను ముదురు రంగు వచ్చే వరకు వేయించి వాటిని పొడి చేసి పెట్టుకోవాలి. ఇది చాలా మంచి వాసన కల్గి ఉంటుంది.

incredible health benefits of onion shell

Advertisement

ఈ పొడిని ఆహార పధార్థాలపై చాట్ మసాలా, మిరియాల పొడిలాగా వాడుకుంటే ఆహారం మరింత రుచిగా మారుతుంది. కేవలం రంగు, రుచి, వాసనే కాదండోయ్ గొప్ప ఆరోగ్యాన్ని కూడా మన సొంతం చేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ తొక్కలు వేసి మరిగించిన నీటిని టీలో కలుపుకుని తాగితే… చాలా మంచిదట. ఉల్లి తొక్కల టీ వల్ల మనసు ప్రశాంతతో పాటు రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందట. అలాగే ఒక గ్లాసు నీటిలో ఉల్లిపాయ పొట్టు వేసి 15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత తొక్కలు తీసేసి ఈ నీటిని తాగినా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్య విషయం ఏంటంటే మీరు మంచి ఆరోగ్యం కోసం ఉల్లిపాయ పొట్టు ఉపయోగించాలనుకుంటే… సేంద్రియ పద్ధతిలో పండించిన ఉల్లిగడ్డల పొట్టును మాత్రమే వాడాలి.

pavan J

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి