Home » Entertainment » Etv Dance Show Dhee Rating Very Down
Entertainment

Dhee Show : ఢీ డాన్స్ షో బాబోయ్ ఇంకా ఈ సోది కామెడీ ఎన్నాళ్లు చూడాలిరా బాబు

Authored By
Himanshi
The Telugu News | Published on: March 10, 2022, 6:00 pm
Advertisement

Dhee Show : ఈటీవీలో సుదీర్ఘ కాలంగా ప్రసారమవుతున్న డ్యాన్స్ షో ఢీ కి ఆదరణ తక్కువ అయింది. గత నాలుగైదు సీజన్లకు రష్మీ సుధీర్ టీం లీడర్ గా వ్యవహరిస్తు ఉండగా ఆది కూడా వారితో జాయిన్ అవ్వడంతో షో కు మంచి రేటింగ్ దక్కేది. ఎప్పటిలాగే ప్రదీప్ తనదైన శైలిలో ఆకట్టుకుంటూ మంచి జోష్ తో ఢీ షో ని ముందుకు తీసుకెళ్ళే వాడు. కానీ అనూహ్యంగా ఈ సీజన్ నుండి సుధీర్ ని మరియు రష్మిని తొలగించడంతో మొత్తం రేటింగ్ తారుమారు అయింది.గత అయిదేళ్లలో ఎప్పుడూ లేనంత దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది అంటూ స్వయంగా ఈ టీవీ కి సంబంధించిన వారే వెల్లడించారు.

Advertisement

ఒక సుదీర్ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి అంటూ వారు బలంగా నమ్ముతున్నారు. ప్రేక్షకులు మరియు బుల్లి తెర విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కానీ ఈ ఢీ షో లో మాత్రం అతని కామెడీ విరక్తి కలిగిస్తుంది అంటూ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మరి ఇంత దారుణమైన కామెడీని ఈ మధ్య కాలంలో చూడలేదు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ షోలో డాన్స్ తో పాటు కామెడీని కూడా ప్రేక్షకులు కోరుకుంటారు. ఢీ షో నిర్వాహకులు ప్రేక్షకులకు అలా అలవాటు చేశారు. కనుక ఇప్పుడు కామెడీ లేకపోవడంతో లోటు క్లియర్ కనిపిస్తుంది. అందుకే దారుణమైన రేటింగ్ నమోదు అవుతుంది.

etv dance show Dhee rating very down

Advertisement

ప్రతి ప్రేక్షకుడు కూడా ఎప్పుడెప్పుడు ఈ సీజన్ పూర్తి అవుతుందా అంటూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. కొత్త సీజన్లో అయినా సుధీర్ మరియు రష్మీ లు రీ ఎంట్రీ ఇస్తారేమో అని ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఢీ షో ను జనాలు త్వరలోనే మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇప్పుడే నిర్వాహకులు ముందు జాగ్రత్తగా పడితే బెటర్‌. ఇంకా ఎన్నాళ్లు ఈ ఢీ సీజన్ ను చూడాలి రా బాబు సోది అంటూ ప్రేక్షకులు అసంతృప్తితో ఉన్నారు. యాంకర్.. జడ్జి.. కంటెస్టెంట్స్.. టీమ్ లీడర్ ఇలా ప్రతి ఒక్కరి విషయంలో కూడా వ్యతిరేకత కనిపిస్తోంది.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి