Morning Workout : ఉదయాన్నే పరగడుపున వ్యాయామాలు చేయడం మంచిదేనా… దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా…?
ప్రధానాంశాలు:
Morning Workout : ఉదయాన్నే పరగడుపున వ్యాయామాలు చేయడం మంచిదేనా... దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా...?
Morning Workout : కొంతమంది ఉదయం లేవగానే వ్యాయామాలు ఎక్సర్సైజులు చేసే అలవాటు ఉంటుంది. లేచిన వెంటనే వ్యాయామాలు చేయటం మొదలు పెడతారు. అయితే వ్యాయామాలు చేసేటప్పుడు ఖాళీ కడుపుతో చేయాలా…? లేదా ఏదైనా తిన్న తర్వాత వ్యాయామం చేయాలా..? ఇలాంటి సందేహం చాలా మందికి ఉంటుంది. మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి. ముఖ్యంగా బరువు తగ్గాలని ఆలోచన వచ్చినవారు…? మొదట చేసే పని వ్యాయామం. కొంతమంది బరువు తగ్గాలని ఎన్నెన్నో వ్యాయామాలు చేస్తుంటారు. కొంతమంది అయితే జిమ్ముకి వెళ్తారు. కొంతమంది అయితే రెగ్యులర్ గా వర్క్ అవుట్ లు చేస్తుంటారు. ఉదయం లేవగానే వర్క్ ఓట్లు చేస్తే బరువు కూడా వేగంగా తగ్గుతుంది.
రాత్రి సమయంలో నిద్ర పోయిన తర్వాత, శరీరంలో గ్లైకోజన్ (స్టెరాయిడ్ కార్బోహైడ్రేట్లు ) తగ్గుతుంది. కావున ఉదయాన్నే మేల్కొన్నప్పుడు గ్లైకో జన్నుకు బదులు,కొవ్వు వేగంగా ప్రవహిస్తుంది. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వర్కౌట్ చేయాలా వద్దా అని సందేహం చాలామందికి వస్తుంది. కొంతమందికి ఖాళీ కడుపుతో పనిచేసినప్పుడే చాలా హాయిగా ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం ఇలా చేయడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిజానికి కాళీ కడుపుతో వ్యాయామం చేయటం అంత మంచిది కాదు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా తగ్గించుకోవడానికి మంచిదే. కానీ ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే, గ్లైకోజన్ యొక్క నష్టం చాలా ఎక్కువగానే ఉంటుంది. మీ శరీరాన్ని బలహీనంగా మారుస్తుంది. మీ శరీరం బలహీనమైనప్పుడు వ్యాయామం చేయటం కూడా కష్టంగానే ఉంటుంది. అవునా ఉదయం పూట అల్పాహారం తిని, తర్వాత వ్యాయామం చేయటం వల్ల ప్రయోజనం పొందొచ్చు. అలా అని ఫుల్లుగా ఫుడ్ తినాలి అని మల్లి అర్థం కాదు. లైట్ గా తినాలి. అయితే ఇప్పుడు వచ్చే మరో ప్రశ్న… అని ఎటువంటి ఆహారం తినాలి..?
మనం వ్యాయామం చేయాలి అనే ముందు అరటిపండు తినవచ్చు. అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి బలం వస్తుంది. ఈ అరటి పండులో ఉండే పిండి పదార్థాలు, పొటాషియం కండరాలు, నరాలను చురుకుగా ఉంచుతాయి. అరటిపండు లేదా ఆపిల్ ని కూడా తిని వ్యాయామం చేయవచ్చు. యాపిల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కావున ఇది చాలా కాలం వరకు కడుపు నిండుగా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. కడుపునిండా తిన్న ఫీలింగ్ వ్యాయామం చేయటం కష్టం అనిపిస్తుంది. కావున లైట్ గా తింటేనే శరీరం కూడా తేలిగ్గా ఉంటుంది. తొందరగా వ్యాయామం చేయటానికి కూడా వీలవుతుంది.