Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే ఉండదు. అవును.. తియ్యగా ఉంటుందని చెక్కర, బెల్లాన్ని తెగ తినేస్తుంటారు కొందరు. చాయ్, కాఫీ, స్వీట్లు, ఇలా రోజూ ఎక్కువ శాతం తీపిని తీసుకుంటూ ఉంటారు. కొందరేమో చెక్కర ఎక్కువ వాడొద్దు.. బెల్లం తినాలి అంటారు. మరికొందరు బెల్లం కూడా మంచిది కాదంటారు. అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్. పదండి.. ఓ సారి తేల్చుకొని వద్దాం.
#image_title
నిజానికి చెక్కర, బెల్లం రెండూ ఆరోగ్యానికి మంచివే. వాటిలో కూడా కొన్ని మినరల్స్ ఉంటాయి. కానీ.. ప్రస్తుతం అసలైన చెక్కర, బెల్లం మార్కెట్ లో దొరకడం లేదు. చెక్కరను రిఫైన్ చేసి అది ఎక్కువ రోజులు నిలువ ఉండేలా కొన్ని కెమికల్స్ కలిపి మార్కెట్ లోకి పంపిస్తున్నారు. అలాంటి చెక్కర తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
బెల్లం కూడా అంతే. బెల్లంలో ఇనుము ఉంటుంది. మెగ్నీషియం ఉంటుంది. అవి పిల్లలకు కూడా అవసరం. తక్షణ శక్తి కూడా కావాలంటే బెల్లం ముక్క తినాలని పెద్దలు చెబుతుంటారు. కానీ.. బెల్లంలో కూడా ఈ మధ్య కెమికల్స్ కలిపి అమ్ముతున్నారు. అందుకే ఆర్గానిక్, ఒరిజినల్ గా దొరికే చెక్కర, బెల్లం తింటే ఎలాంటి సమస్య ఉండదు. పైగా వాటిలో ఉండే మినరల్స్ బాడీకి అందుతాయి. కల్తీ చేసిన చెక్కర, బెల్లం తింటే మాత్రం.. తినడానికి తియ్యగానే ఉంటాయి కానీ.. భవిష్యత్తులో అనేక రోగాలకు అవే ఫస్ట్ రీజన్ అవుతాయి.