
Summer : ఎండాకాలంలో ఈ 5 రకాల పండ్లు తింటే చాలు... నీటిని పదే పదే తాగాల్సిన అవసరం ఉండదు..? ఆ పండ్లు ఇవే...?
Summer : ఎండాకాలంలో శరీరం అధిక ఉష్ణోగ్రతలు కారణంగా డీహైడ్రేషన్కు గురవుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఎంత నీరు తాగినా సరే.. అసలు దాహం ఆగదు. నోరు ఎండుతూనే ఉంటుంది. చల్ల చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది. మరి ఇలాంటి ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే.. వేసవికాలంలో వచ్చే పండ్లను తీసుకోవడం వలన ఎక్కువ నీటిని పదేపదే తాగవలసిన అవసరం ఉండదు. ఆ పండ్లు,5 రకాల సమ్మర్ ఫ్రూట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరగడం మనకి భయాందోళనల కలిగిస్తున్నాయి. ప్రియ వ్రత పెరిగితే డిహైడ్రేషన్కు గురవాల్సిందే. ఈ ఎండలో బయటికి వెళ్లాలంటే భయం. ఇలాంటి సందర్భాలలో వేసవి ప్రభావాలు తగ్గాలంటే వేసవిలో లభించే 5 రకాల ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి. ఐదు రకాల ఫ్రూట్స్ ని మనం తీసుకోవడం వల్ల నీటిని పదే పదే తాగాల్సిన అవసరం ఉండదు.
Summer : ఎండాకాలంలో ఈ 5 రకాల పండ్లు తింటే చాలు… నీటిని పదే పదే తాగాల్సిన అవసరం ఉండదు..? ఆ పండ్లు ఇవే…?
ఎక్కువ నీటిని తాగడానికి బదులు అప్పుడప్పుడు ఈ ఫ్రూట్స్ని కూడా తింటూ ఉంటే శరీరంలో డిహైడ్రేషన్ సమస్య తక్కువ అవుతుంది. మనం ఎండలో బాగా తిరిగినప్పుడు శరీరం చెమటల రూపంలో మన ఒంటిలో ఉన్న నీటిని బయటకి పంపుతుంది. అప్పుడు శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది. శరీరం సరిగ్గా పని చేయాలంటే నీరు ఎంతో అవసరం. ఎక్కువగా నీటిని మాత్రమే కాకుండా ఆహార పదార్థాలు అంటే పండ్లతో కూడా నీటి శాతాన్ని శరీరంలో పెంచుకోవచ్చు. నీరు తగినంత లేని పరిస్థితుల్లో,శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. విషపూరిత పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. UCLA నివేదిక ప్రకారం, శరీరం ఆహారం నుండి 20% నీటిని పొందుతుందని.80% శాతం నీరు త్రాగాలి. తక్కువ నీరు తాగుతుంటే, నీరు పుష్కలంగా ఉన్న ఆహారాలను తినాలి. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. అనేక కూరగాయలు పండ్లలో 90% వరకు నీరు ఉంటుంది. వాటిని తినడం వల్ల శరీరంలో నీటి స్థాయిలు మెరుగుపడతాయి. కొన్ని ముఖ్యమైన ఆహారాలు.
కీర దోసకాయలో దాదాపు 96% నీరు ఉంటుంది. ఈ దోసకాయ వేసవిలో తింటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.
ముల్లంగి : ఈ ముల్లంగిలో 95% నీరు, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జిర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి.
టమోటా : టమాటాలో 94% నీరు ఉంటే టమోటాలో లైకోఫిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
పుచ్చకాయ : పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. దీనిలో శరీరానికి తక్షణ శక్తిని అందించడంతోపాటు పలు పోషకాలు కూడా నిండి ఉంటాయి.
స్ట్రాబెరీలు : 90% శాతం నీరు కలిగిన స్ట్రాబెరీ లో ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉండి ఇమ్యూనిటీని పెంచే గుణాలు కలిగి ఉంటాయి.
వేసవిలో ఈ ఆహారాలను చేర్చుకోవడం ద్వారా, శరీరంలో సరైన నీటి స్థాయిలను నిర్వహించుకోవచ్చు. వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. తగినంత నీరు త్రాగడంతో పాటు,నీరు అధికంగా ఉండే పండ్లు కూరగాయలను ఆహారంలో చేర్చుకోండి.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
This website uses cookies.