Summer : ఎండాకాలంలో ఈ 5 రకాల పండ్లు తింటే చాలు… నీటిని పదే పదే తాగాల్సిన అవసరం ఉండదు..? ఆ పండ్లు ఇవే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Summer : ఎండాకాలంలో ఈ 5 రకాల పండ్లు తింటే చాలు… నీటిని పదే పదే తాగాల్సిన అవసరం ఉండదు..? ఆ పండ్లు ఇవే…?

 Authored By ramu | The Telugu News | Updated on :28 March 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Summer : ఎండాకాలంలో ఈ 5 రకాల పండ్లు తింటే చాలు... నీటిని పదే పదే తాగాల్సిన అవసరం ఉండదు..? ఆ పండ్లు ఇవే...?

Summer  : ఎండాకాలంలో శరీరం అధిక ఉష్ణోగ్రతలు కారణంగా డీహైడ్రేషన్కు గురవుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఎంత నీరు తాగినా సరే.. అసలు దాహం ఆగదు. నోరు ఎండుతూనే ఉంటుంది. చల్ల చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది. మరి ఇలాంటి ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే.. వేసవికాలంలో వచ్చే పండ్లను తీసుకోవడం వలన ఎక్కువ నీటిని పదేపదే తాగవలసిన అవసరం ఉండదు. ఆ పండ్లు,5 రకాల సమ్మర్ ఫ్రూట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరగడం మనకి భయాందోళనల కలిగిస్తున్నాయి. ప్రియ వ్రత పెరిగితే డిహైడ్రేషన్కు గురవాల్సిందే. ఈ ఎండలో బయటికి వెళ్లాలంటే భయం. ఇలాంటి సందర్భాలలో వేసవి ప్రభావాలు తగ్గాలంటే వేసవిలో లభించే 5 రకాల ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి. ఐదు రకాల ఫ్రూట్స్ ని మనం తీసుకోవడం వల్ల నీటిని పదే పదే తాగాల్సిన అవసరం ఉండదు.

Summer ఎండాకాలంలో ఈ 5 రకాల పండ్లు తింటే చాలు నీటిని పదే పదే తాగాల్సిన అవసరం ఉండదు ఆ పండ్లు ఇవే

Summer : ఎండాకాలంలో ఈ 5 రకాల పండ్లు తింటే చాలు… నీటిని పదే పదే తాగాల్సిన అవసరం ఉండదు..? ఆ పండ్లు ఇవే…?

ఎక్కువ నీటిని తాగడానికి బదులు అప్పుడప్పుడు ఈ ఫ్రూట్స్ని కూడా తింటూ ఉంటే శరీరంలో డిహైడ్రేషన్ సమస్య తక్కువ అవుతుంది. మనం ఎండలో బాగా తిరిగినప్పుడు శరీరం చెమటల రూపంలో మన ఒంటిలో ఉన్న నీటిని బయటకి పంపుతుంది. అప్పుడు శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది. శరీరం సరిగ్గా పని చేయాలంటే నీరు ఎంతో అవసరం. ఎక్కువగా నీటిని మాత్రమే కాకుండా ఆహార పదార్థాలు అంటే పండ్లతో కూడా నీటి శాతాన్ని శరీరంలో పెంచుకోవచ్చు. నీరు తగినంత లేని పరిస్థితుల్లో,శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. విషపూరిత పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. UCLA నివేదిక ప్రకారం, శరీరం ఆహారం నుండి 20% నీటిని పొందుతుందని.80% శాతం నీరు త్రాగాలి. తక్కువ నీరు తాగుతుంటే, నీరు పుష్కలంగా ఉన్న ఆహారాలను తినాలి. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. అనేక కూరగాయలు పండ్లలో 90% వరకు నీరు ఉంటుంది. వాటిని తినడం వల్ల శరీరంలో నీటి స్థాయిలు మెరుగుపడతాయి. కొన్ని ముఖ్యమైన ఆహారాలు.

Summer కీరదోసకాయ

కీర దోసకాయలో దాదాపు 96% నీరు ఉంటుంది. ఈ దోసకాయ వేసవిలో తింటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.

ముల్లంగి : ఈ ముల్లంగిలో 95% నీరు, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జిర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి.

టమోటా : టమాటాలో 94% నీరు ఉంటే టమోటాలో లైకోఫిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

పుచ్చకాయ : పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. దీనిలో శరీరానికి తక్షణ శక్తిని అందించడంతోపాటు పలు పోషకాలు కూడా నిండి ఉంటాయి.

స్ట్రాబెరీలు : 90% శాతం నీరు కలిగిన స్ట్రాబెరీ లో ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉండి ఇమ్యూనిటీని పెంచే గుణాలు కలిగి ఉంటాయి.
వేసవిలో ఈ ఆహారాలను చేర్చుకోవడం ద్వారా, శరీరంలో సరైన నీటి స్థాయిలను నిర్వహించుకోవచ్చు. వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. తగినంత నీరు త్రాగడంతో పాటు,నీరు అధికంగా ఉండే పండ్లు కూరగాయలను ఆహారంలో చేర్చుకోండి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది