Home » Exclusive » Kuppintaku Magical Uses In Telugu
Exclusive

Health Tips : డాక్టర్స్ నే ఆశ్చర్యపరిచిన మొక్క.. ఎక్కడ కనిపించిన వదలకండి ..!!

Authored By
aruna
The Telugu News | Published on: January 5, 2024, 9:30 pm
Advertisement

Health Tips : మన చుట్టూ పరిసరాలలో మనకు తెలియని ఎన్నో మొక్కలు ఉంటాయి. కానీ వాటిని పిచ్చి మొక్కలు అనుకుంటాం. అలా అనుకున్న వాటిల్లో ఒకటే కుప్పింటాకు. ఈ మొక్కను భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఎన్నో రకాల మందులలో వాడుతున్నారు. ఇన్ని రకాల ఔషధాలు ఉన్న ఈ మొక్క మన ఇంటి పెరట్లోనూ, మన చుట్టూ పరిసరాలలోనూ పెరుగుతుంది. కాకపోతే దీనిని మనం పిచ్చి మొక్క అనుకుంటాం. ఈ మొక్కకి చిన్న చిన్న గిన్నెల పువ్వుల గుత్తులు ఉంటాయి. చూడగానే ఓ ఈ మొక్క అని అనుకుంటాం. ఈ మొక్క ఎక్కువగా గడ్డి ఉండే ప్రాంతాలలో కనిపిస్తుంది. ఎటువంటి వ్యాధులైన తగ్గిస్తుంది. జలుబు, తలనొప్పి, జ్వరం, కాళ్ల నొప్పులు, నడుం నొప్పి, జీర్ణ సమస్యలు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఈ మొక్క మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ మొక్కల ఆకుల రసం నూనెలో కరిగిస్తే చక్కగా రంగు వస్తుంది.

Advertisement

కొంచెం కొబ్బరి నూనెలో ఈ ఆకుల రసాన్ని వేసి బాగా మరిగించి చల్లారనివ్వాలి. తర్వాత ఒక గాజు కంటైనర్ లో భద్రం చేసుకోవాలి. నొప్పి ఉన్నచోట ఈ ఆయిల్ కొద్దిగా వేడి చేసి రాసుకుంటే నొప్పులు క్షణాల్లో మటుమాయం అయిపోతాయి. తలనొప్పి ఉన్నచోట ఈ ఆకుల రసాన్ని నుదుటిమీద రాస్తే కొద్దిసేపటికి రిలాక్స్ అవుతుంది. అలాగే ఈ మొక్కను మొహం మీద ఉండే మచ్చలను తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే మొహం మంచి రంగు రావాలంటే ఈ మొక్క ఆకులు సహాయ పడతాయి. ఈ కుప్పింటాకు మొక్క ఆకులను శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వడకట్టుకొని రెండు చెంచాల వరకు తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో ఈ నీటిని త్రాగకూడదు. ఎందుకంటే ఎక్కువ నీరు తీసుకుంటే వాంతులు అవుతాయి.

ప్రతిరోజు రెండు స్పూన్ల నానబెట్టిన కుప్పింటి ఆకుల నీళ్లను రెండు స్పూన్ల వరకు తీసుకుంటే మొహం మంచి రంగు వస్తుంది. అలాగే రక్తం కారుతున్న చోట, వాపు ఉన్నచోట కూడా ఈ ఆకుల రసాన్ని రాస్తే నొప్పి తగ్గుతుంది. ఇక ఈ కుప్పింటాకు కాండంతో పళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. దీంతో పంటి సంబంధిత సమస్యలన్నీ పోతాయి. అలాగే చర్మం వ్యాధులకు కూడా ఈ ఆకు చక్కగా పనిచేస్తుంది. గజ్జి, తామర, దురద ఉంటే ఈ ఆకు రసంలో నిమ్మరసం కలిపి తామర లేదా గజ్జి ఉన్నచోట రాస్తే తగ్గిపోతుంది. ఇక ఈ ఆకులను కొన్ని చోట్ల కూరలా కూడా వండుకొని తింటారు. ఇలా తినడం వలన కడుపులో ఉండే నులి పురుగులు లాంటివి చచ్చిపోతాయి. అయితే ఈ కూరను మితంగా తినాలి. అతిగా మాత్రం తినకూడదు. దేనినైనా మితంగానే తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి ఎంత మంచి ఆహారం అయినా సరే మితంగానే తినాలి అప్పుడే ఆరోగ్యానికి మంచిది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి