YS Sharmila : వై.యస్.షర్మిల మధ్యలో హ్యాండ్ ఇస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ..??

YS Sharmila  : వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి చేరారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత సోనియా పైన కాంగ్రెస్ పైన జగన్ తో పాటు షర్మిల కూడా విమర్శలు చేశారు.అన్నీ మర్చిపోయి షర్మిలను పార్టీలోకి హై కమాండ్ తీసుకుంది. అయితే ఏపీలో షర్మిల ఎంత బలంగా నిలబడతారు అనేదానిపై సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే షర్మిల పార్టీ పెట్టి రాజకీయంగా నిలదొక్కుకోవడం కన్నా ఆస్తులు పంచాయతీని తేల్చుకోవడానికి అన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో పోటీకి వెనకడుగు వేసినట్లుగా ఏపీలో తన పంతం నెరవేరిందని మధ్యలో హ్యాండ్ ఇస్తే కాంగ్రెస్ కి చెడ్డ పేరు వస్తుంది. వై.యస్.షర్మిల రాజకీయాల్లోకి రావడానికి కారణం తన అన్నతో ఉన్న విభేదాలు అని అందరూ ఏకగ్రీవంగా చెబుతున్నారు. ప్రజల కు సంబంధం లేని అజెండాతో పార్టీ పెట్టుకుంటే తమ డిమాండ్ నెరవేరగానే మధ్యలో రాజకీయాలకు గుడ్ బై చెబుతారు. ఇప్పుడు షర్మిల విషయంలో ఇదే అనుమానాలు వస్తున్నాయి.

తెలంగాణలో షర్మిల వైయస్సార్ టీపీ పార్టీని పెట్టారు. పాదయాత్రలు చేశారు. సీఎం అవుతానని ఛాలెంజ్ లు చేశారు. కానీ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. ఏపీ కాంగ్రెస్ ఆఫర్లు ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. తెలంగాణలో రాజకీయం చేస్తే ఆమెకు ఎవరు అభ్యంతరం పెట్టలేదు. కానీ కాంగ్రెస్ను ఏపీలో బలపరుస్తాను అంటే మాత్రం అనేక ఒత్తిడి లు వస్తాయి. ముఖ్యంగా కుటుంబ ఒత్తిడిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏపీలో కాంగ్రెస్ బలహీన పడటానికి కారణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం కాదని వై.యస్.జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం వలన కాంగ్రెస్ కనుమరుగైంది. కాంగ్రెస్ క్యాడర్లు నాయకులంతా వైసీపీలోకి చేరారు. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత స్థానిక సంస్థల ఫలితాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాన్ని సాధించింది. కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా దెబ్బతీసింది వై.యస్.జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడమే. ఇక ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ ఆమె కుటుంబ పరిస్థితుల వలన మధ్యలోనే రాజీ పడితే పరిస్థితి ఏంటి అనేది మరో అంశం. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓటు కూడా రావటం లేదని షర్మిల పార్టీ లోకి వస్తే కొన్ని వర్గాల తో పాటు కొంతమంది వలసనేతలు వస్తారని నమ్ముతున్నారు.

ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరుతానని చెప్పారు. వైసీపి టికెట్లు కసరత్తు పూర్తయిన తర్వాత టీడీపీ వైసీపీలో టికెట్లు దక్కని నేతలు కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్ బలపడితే వై.యస్.జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడుతుంది. ఈ క్రమంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉండిపోరు. ఇప్పటినుంచి వైయస్ షర్మిల తో రాజీ పడేందుకు చూస్తున్నారు. కుటుంబ పరువు కోసం ఆమె రాజీ పడే అవకాశం ఉండవచ్చు. ఆస్తులు పంచితే షర్మిల సైలెంట్ అయిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. తమకు నష్టం జరిగితే షర్మిలను పోటీ నుంచి దింపేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తారు. ఆమె ఏ కారణంతో విభేదించారు, అన్ని షరతులను ఒప్పుకొని పోటీ నుంచి విరమింప చేయాలని అనుకుంటే కాంగ్రెస్ ను మళ్లీ చావు దెబ్బ కొట్టాలని అనుకుంటారు. ఇలాంటి ఒత్తిడిలను అధిగమించి కాంగ్రెస్ పార్టీ తను పెట్టుకున్న నమ్మకాన్ని వై.యస్.షర్మిల అందుకోవాల్సి ఉంది. ఒకవేళ వైయస్ షర్మిల హ్యాండ్ ఇస్తే వైయస్ కుటుంబం మరోసారి కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ కొట్టినట్లు అవుతుంది.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

16 minutes ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

1 hour ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

2 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

4 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

5 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

6 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

7 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

8 hours ago