Hair Growth : ప్రతి ఒక్క అమ్మాయి తన జుట్టు అందంగా మరియు ఒత్తుగా, పొడవుగా ఉండాలి అని కోరుకుంటుంది. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే జుట్టు పెరగటం కోసం ఇతర రకాల నూనెలు మరియు షాంపూలను కూడా వాడుతూ ఉంటారు. అయితే నిపుణుల అభిప్రాయి ప్రకారం చూస్తే, రాత్రి పూట మిగిలిపోయినటువంటి అన్నం జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు. ఇది మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే జుట్టు పోషణకు చద్దన్నం చాలా మేలు చేస్తుంది అని అంటున్నారు. అలాగే అన్నం వాడటంతో మీ జుట్టు పొడవుగా మరియు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది అని అంటున్నారు నిపుణులు. అయితే జుట్టుకు అన్నని ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఒక పెద్ద గిన్నెలోనికి ఒక కప్పు రాత్రి మిగిలిపోయినటువంటి అన్నాన్ని తీసుకోవాలి. అలాగే వాటిలోకి రెండు స్పూన్ల మెంతులు కూడా తీసుకోవాలి. వీటిలో బీట్ రూట్ రసం మరియు తాజా అలోవెరా జల్ ను కూడా వేసుకోవాలి. అయితే మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. అలాగే నానబెట్టినటువంటి మెంతులను అన్నంతో కలిపి పోస్ట్ లా తయారు చేయాలి. వాటిలో బీట్ రూట్ జ్యూస్ మరియు అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు కుదుళ్ల నుండి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేసుకోవాలి. ఇలా ఒక గంటపాటు వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీనిని కనుక మీరు ప్రతిరోజు వాడితే మీ జుట్టుకు మంచి పోషణ అనేది దొరుకుతుంది. అలాగే జుట్టు రాలడం ఆగి పొడవుగా పెరుగుతుంది. ఇలా జుట్టుకు అన్నాన్ని వాడడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఈ హెయిర్ ప్యాక్ ను వాడటం వలన జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అంతేకాక వెంట్రుకలు రాలే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే ఇది మీ జుట్టును మెరిసేలా మరియు స్ట్రాంగ్ గా ఉంచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది.
మరొక పద్ధతిలో చూస్తే, ఒక పావు కప్పు వరకు వండిన అన్నాన్ని తీసుకోండి. వాటిలో పావుకప్పు ఫ్లాక్స్ సీడ్ జెల్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్ జెల్ లేకుంటే దానికి బదులుగా అలోవెరా జెల్ ను కూడా వాడవచ్చు. దీనిలో అర స్పూన్ నల్ల నువ్వుల నూనె కూడా కలుపుకోవాలి. అంతేకాక కొన్ని చుక్కల రోజ్మెరీ ఎసెన్సియల్ ఆయిల్ ను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్రైండర్ లో వేసి మేత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ ను స్కాల్ఫ్ మరియు జుట్టుకు అప్లై చేసుకోవాలి. దీనిని 30 నిమిషాలు ఆరిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ జుట్టును హెర్బల్ షాపుతో క్లీన్ చేసుకోవాలి. ఇది మీ జుట్టు రాలడాన్ని తొందరగా తగ్గిస్తుంది. అలాగే ఈ హెయిర్ మాస్కుని వాడటం వల్ల జుట్టు మునుపటి కంటే చాలా మృదువుగా కూడా మారుతుంది. క్రమక్రమంగా జుట్టు కోల్పోయినటువంటి షైన్ కూడా తిరిగి వస్తుంది. మీరు ఈ హెయిర్ మాస్క్ ను వారానికి రెండు లేక మూడు సార్లు వాడొచ్చు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.