Home » Health » Liver Detox
Health

Liver Detox : మీ లివర్ ని న్యాచురల్ పద్ధతిలో ఆరోగ్యంగా ఉంచాలంటే… సద్గురువు చెప్పిన సీక్రెట్స్ డ్రింక్ ఇదే…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: May 31, 2025 1:03 pm
Advertisement

Liver Detox : శరీరంలో ముఖ్యమైన అవయవాలలో గుండె ఎంత ముఖ్యమో అలాగే కాలేయం కూడా అంత ముఖ్యమైన అవయవం. ముఖ్యంగా శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపే ప్రక్రియలు ఇది ముఖ్యపాత్రను పోషిస్తుంది. జీర్ణక్రియలో,పోషకాలను నిల్వ చేయడంలోనూ కీలకపాత్రను పోషిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మొదట ప్రభావం చూపించేది కాలేయంపైనే. పనితీరు మందగిస్తే ఆరోగ్యం క్షేనిస్తుంది. కాబట్టి, కాలయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి. ఇంకా శుభ్రం చేయడానికి సద్గురువు ఒక సహజ పానీయాన్ని తయారుచేసి చూపించారు.
కాలేయం మన శరీరంలోని ముఖ్యమైన అవయవం. తీరంలోని మలినాలను బయటకు పంపుటకు ఇది ఎంతో సహాయపడుతుంది. నేటి ఆధునిక జీవనశైలి వల్ల కాలేయంపై భారం పెరుగుతుంది. ఆలయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సద్గురువు ఒక సహజ డిటాక్స్ పానీయాన్ని సూచించారు. ఆ పానీయం వేప ఆకులు, పసుపు,తేనె,నిమ్మరసం కలిపి తయారు చేసుకుని, ఈ పానీయం కాలేయాన్ని శుభ్రం చేయుటకు అద్భుతంగా పనిచేస్తుంది. సద్గురువు తెలియజేసిన ఈ డిటెక్స్ పానీయం, మన కాలయాన్ని శుభ్రం చేయడానికి, శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది.దీని తయారీ చాలా సులభం.

Advertisement

Liver Detox : మీ లివర్ ని న్యాచురల్ పద్ధతిలో ఆరోగ్యంగా ఉంచాలంటే… సద్గురువు చెప్పిన సీక్రెట్స్ డ్రింక్ ఇదే…?

Liver Detox కావాల్సిన పదార్థాలు

వేప ఆకులు కొన్ని,పసుపు చిటికెడు,తేనే రుచికి సరిపడా, నిమ్మరసం కొద్దిగా, గోరువెచ్చని నీరు ఒక గ్లాస్.

Advertisement

తయారీ విధానం : ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొన్ని వేప ఆకులను వేసి బాగా నానబెట్టాలి. లేదా, వేప ఆకులను మెత్తగా రుబ్బి ఆ రసాన్ని నీటిలో కలపండి. దీనికి చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం,రుచికి సరిపడా తేనెను కలిపి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవాలి.

ఈ పానీయం వల్ల కలిగే ప్రయోజనాలు : కాలయ శుద్ధి : వేప,పసుపు, కాలయాన్ని శుభ్రం చేయడానికి విష పదార్థాలను తొలగించడానికి సహాయపడతాయి.

Advertisement

రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది : పసుపులో ఉండే కర్క్యూమిన్, యాంటీ ఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జీర్ణక్రియ మెరుగు : ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరచి,మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

శక్తి స్థాయిలు పెంపు : శరీరంలో విష పదార్థాలు బయటకు వెళ్లడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలసట తగ్గుతుంది.

చర్మ ఆరోగ్యం : శరీరం లోపల శుభ్రపరచడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగానూ, కాంతివంతంగా మారుతుంది. పానీయం వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం ద్వారా కాలయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అయితే,ఏదైనా కాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పానీయాన్ని తీసుకునే ముందు వైద్యనిపుడిని సంప్రదించడం మంచిది. ఆహారపు అలవాట్లు,క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి