
Belly Fat Melts Away : వంటింట్లో లభించే వీటితో ఈ డ్రింక్ తయారుచేసి తాగండి.. బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది
Belly Fat Melts Away : మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలతో ఆరోగ్యకరమైన డ్రింక్ తయారు చేసుకోవచ్చని తెలుసా? ఈ ప్రత్యేకమైన డ్రింక్ కోసం అవసరమయ్యే పదార్థాలు మన ఇంట్లో సులభంగా దొరికేవే. జీలకర్ర, వాము, సోంపు, నిమ్మరసం, గోరువెచ్చటి నీరు. ఇవన్నీ కలిసి తీసుకుంటే శరీరంలో గ్యాస్, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయి.
Belly Fat Melts Away : వంటింట్లో లభించే వీటితో ఈ డ్రింక్ తయారుచేసి తాగండి.. బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది
జీలకర్ర, వాము, సోంపు వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిని సరిచేయడమే కాకుండా.. ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఈ గోరువెచ్చటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నెమ్మదిగా కరిగిపోతుంది. ముఖ్యంగా కడుపు భాగం చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో ఇది ఎంతో సహాయ పడుతుంది.
వీటితో తయారు చేసిన గోరువెచ్చటి నీటిలో ఉండే సహజ పదార్థాలు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా సహాయ పడతాయి. అవి కాలేయాన్ని శుభ్రపరచడంలో తోడ్పడతాయి. దీని వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ దీనిని తాగడం వల్ల శరీరం తేలికగా, చురుకుగా అనిపిస్తుంది.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక్కో టీ స్పూన్ జీలకర్ర, వాము, సోంపు వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని సన్నని మంటపై కొద్దిగా వేడి చేసి అందులో అర నిమ్మకాయ రసం కలిపి ఖాళీ కడుపుతో తాగాలి. ఇదే విధంగా ప్రతిరోజూ తాగితే మంచి ఫలితాలను పొందవచ్చు.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.