Minapa pappu : మీరు పొట్టు మినప్పప్పుని వాడుతున్నారా… అయితే ఈ ప్రయోజనాలన్ని మీకే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Minapa pappu : మీరు పొట్టు మినప్పప్పుని వాడుతున్నారా… అయితే ఈ ప్రయోజనాలన్ని మీకే…?

 Authored By ramu | The Telugu News | Updated on :26 July 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Minapa pappu : మీరు పొట్టు మినప్పప్పుని వాడుతున్నారా... అయితే ఈ ప్రయోజనాలన్ని మీకే...?

Minapa pappu : దారుణంగా మినప్పప్పు అంటే ఎన్నో పోషకాలు కలిగిన ప్రోటీన్ ఆహారం. రకరకాల వంటకాలు చేసుకొని భుజిస్తూ ఉంటారు. ప్రోటీన్లు,యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు,ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా నిండి ఉంటాయి. ఈ పప్పులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి, దీనిని మీ ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

Minapa pappu మీరు పొట్టు మినప్పప్పుని వాడుతున్నారా అయితే ఈ ప్రయోజనాలన్ని మీకే

Minapa pappu : మీరు పొట్టు మినప్పప్పుని వాడుతున్నారా… అయితే ఈ ప్రయోజనాలన్ని మీకే…?

Minapa pappu మినపప్పు ఆరోగ్య ప్రయోజనాలు

ఈ పప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది.వంటకాలలో రుచిని కూడా పెంచుతుంది. దీనిని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. మినప్పప్పు పోషకాల గని అంటున్నారు నిపుణులు. మినప్పప్పులో ప్రోటీన్లు,యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్లు,ఫైబర్, మెగ్నీషియం, ఐరన్,పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. మినప్పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది.కాబట్టి, దీనిని ఆహారంలో చేర్చుకుంటే జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది.

డయాబెటిస్ పేషెంట్లకు : మినపప్పు మధుమేహ వ్యాధిగ్రస్తులకు వంటకాలలో ప్రతిరోజు చేర్చుకున్నట్లైతే ఎంతో ప్రయోజనం ఉందంటున్నారు వైద్య నిపుణులు. మినప్పప్పు మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.ఇంకా మధుమేహ బాధితులకు మినప్పప్పు ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు. పోట్టు తీయని మినప్పప్పు తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం అంటున్నారు.ఈ పప్పులో పుష్కలంగా ఉండే ఫైబర్, ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.
మినప్పప్పులు ఐరన్ అధికంగా ఉంటుంది. తద్వారా రక్తహీనత తగ్గుతుంది. అలాగే కిడ్నీల సంరక్షణకు మంచిది. మినప్పప్పులో అధికంగా కాల్షియం, ఫాస్ఫరస్ ఉండుట చేత ఎముకలను ఆరోగ్యంగా, దృఢంగా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. మినప్పప్పు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఈ పప్పులో సన్ టాన్స్, మొటిమలు ఇతర చర్మ సమస్యలను తగ్గించగలదు. అంతేకాదు, ఈ పప్పుతో జుట్టు సంరక్షణకు కూడా మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది