Health Tips : పూర్వ కాలంలో పాల కాయలు లేదా పాల పండ్లను పండ్ల రాజు అని పిలిచేవారంట. పూర్వం ఎన్నో రకాల వ్యాధులకు చికిత్స చేసేందుకు ఈ పాల పండ్లను వాడేవారని మన పురాణాలు చెబుతున్నాయి. వాస్తవానికి పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో దీనిని రాజ్ ఫఆల్ లేదా రాజ్దాన్ అని పిలిచే వారు. ఖిర్ని దీని హిందీ పేరు. ఈ పండును తెలుగులో పట్ల పాలకాయలు, పాలపండ్లు, పోలా అని పిలుస్తారు. అయితే మలయాళీలు మాత్రం దీన్ని పలమున్ పల అని తమిళులు ఉలక్కైప్పలై అని అంటుంటారు. దీన్ని ఇంగ్లీషఉలో విముసోప్స్ అని పిలుస్తారు. అయితే పాల పండ్ల శాస్త్రీయ నామం మనీల్కర హెక్సాండ్రా లేదా మిముసోప్స్ హెక్సాండ్రా.అయితే పాలకాయల చెట్ట ఆరోగ్యంగా ఉంటే వందల సంవత్సరాలు బతుకుతుంద.
దాదాపు 50 అడుగుల పొడవుతో ఉండే ఈ చెట్టు ప్రకాశవంతమైన తెల్లని పువ్వలను కల్గి ఉంటుంది. ఈ పాలపండ్ల చెట్టు ఆకులు దీర్ఘ వృత్తాకారంగా ఉంటయి. ఖిర్ని పండ్లు వేసవి కాలంలో కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సపోటా, చికూ పండ్ల వంటి రుచిని కల్గి ఉండే ఈ పాల పండ్లు సువాసన గల పాల ద్రవాన్ని స్రవిస్తాయి. అలాగే పోషకమైన భాగాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాల పండ్లలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఉపయోగకరమైన కొవ్వుసు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం యొక్క సరైన పెరుగుదల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటామిన్ సి, ఎలు కూడా అధికంగానే ఉంటాయట. అంతే కాదండోయ్ ఈ పండ్ల గుజ్జులో పాలీఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు, స్టెరాల్స్, టానిన్లు, సపోనిన్లు, ట్రైటెర్పెనాయిడ్స్, మైరిసెటిన్, క్వెర్సెటిన్ లు ఎక్కువగా ఉంటాయి.
వీటి వల్ల పండు రుచి చాలా బాగుంటుంది. అంతే కాకుండా ఇందులో ఉన్న పలు రకాల పోషకాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పండును తినడం వల్ల రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందట. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కిడ్నీ పనితీరును మెరుగు పరచడంలో పాల పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. పొట్టలో ఉండే అల్సర్ ను తగ్గిస్తుంది. అలాగే ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. పుండ్లు, రక్తస్రావం, కామెర్లు, జ్వరం, కీళ్ల నొప్పులు తగ్గించేందుకు వాడే ఆయుర్వేద మందుల్లో పాల పండ్ల చెట్టును ఉపయోగిస్తారయ. అధ్భుతమైన రుచితో పాటు శారీరక బలాన్ని, రక్త ఉత్పత్తిని చేకూర్చే పాల పండ్లను జీవితంలో ఒక్క సారైనా తినాల్సిందే.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.