Health Tips : ఈ ఒక్క కాయ తిన్నారంటే చాలు.. లీటర్ రక్తం ఈజీగా పడుతుంది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఈ ఒక్క కాయ తిన్నారంటే చాలు.. లీటర్ రక్తం ఈజీగా పడుతుంది!

 Authored By pavan | The Telugu News | Updated on :15 March 2022,3:00 pm

Health Tips : పూర్వ కాలంలో పాల కాయలు లేదా పాల పండ్లను పండ్ల రాజు అని పిలిచేవారంట. పూర్వం ఎన్నో రకాల వ్యాధులకు చికిత్స చేసేందుకు ఈ పాల పండ్లను వాడేవారని మన పురాణాలు చెబుతున్నాయి. వాస్తవానికి పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో దీనిని రాజ్ ఫఆల్ లేదా రాజ్దాన్ అని పిలిచే వారు. ఖిర్ని దీని హిందీ పేరు. ఈ పండును తెలుగులో పట్ల పాలకాయలు, పాలపండ్లు, పోలా అని పిలుస్తారు. అయితే మలయాళీలు మాత్రం దీన్ని పలమున్ పల అని తమిళులు ఉలక్కైప్పలై అని అంటుంటారు. దీన్ని ఇంగ్లీషఉలో విముసోప్స్ అని పిలుస్తారు. అయితే పాల పండ్ల శాస్త్రీయ నామం మనీల్కర హెక్సాండ్రా లేదా మిముసోప్స్ హెక్సాండ్రా.అయితే పాలకాయల చెట్ట ఆరోగ్యంగా ఉంటే వందల సంవత్సరాలు బతుకుతుంద.

దాదాపు 50 అడుగుల పొడవుతో ఉండే ఈ చెట్టు  ప్రకాశవంతమైన తెల్లని పువ్వలను కల్గి ఉంటుంది. ఈ పాలపండ్ల చెట్టు ఆకులు దీర్ఘ వృత్తాకారంగా ఉంటయి. ఖిర్ని పండ్లు వేసవి కాలంలో కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సపోటా, చికూ పండ్ల వంటి రుచిని కల్గి ఉండే ఈ పాల పండ్లు సువాసన గల పాల ద్రవాన్ని స్రవిస్తాయి. అలాగే పోషకమైన భాగాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాల పండ్లలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఉపయోగకరమైన కొవ్వుసు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం యొక్క సరైన పెరుగుదల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటామిన్ సి, ఎలు కూడా అధికంగానే ఉంటాయట. అంతే కాదండోయ్ ఈ పండ్ల గుజ్జులో పాలీఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు, స్టెరాల్స్, టానిన్లు, సపోనిన్లు, ట్రైటెర్పెనాయిడ్స్, మైరిసెటిన్, క్వెర్సెటిన్ లు ఎక్కువగా ఉంటాయి.

pala pandlu and pala kayala health Tips

pala pandlu and pala kayala health Tips

వీటి వల్ల పండు రుచి చాలా బాగుంటుంది. అంతే కాకుండా ఇందులో ఉన్న పలు రకాల పోషకాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పండును తినడం వల్ల రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందట. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కిడ్నీ పనితీరును మెరుగు పరచడంలో పాల పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. పొట్టలో ఉండే అల్సర్ ను తగ్గిస్తుంది. అలాగే ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. పుండ్లు, రక్తస్రావం, కామెర్లు, జ్వరం, కీళ్ల నొప్పులు తగ్గించేందుకు వాడే ఆయుర్వేద మందుల్లో పాల పండ్ల చెట్టును ఉపయోగిస్తారయ. అధ్భుతమైన రుచితో పాటు శారీరక బలాన్ని, రక్త ఉత్పత్తిని చేకూర్చే పాల పండ్లను జీవితంలో ఒక్క సారైనా తినాల్సిందే.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది